Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ‌లాపాల్ న‌గ్న స‌న్నివేశాల పైన ర‌చ్చ‌ రచ్చ... షోస్ క్యాన్సిల్...

Advertiesment
అమ‌లాపాల్ న‌గ్న స‌న్నివేశాల పైన ర‌చ్చ‌ రచ్చ... షోస్ క్యాన్సిల్...
, శుక్రవారం, 19 జులై 2019 (14:49 IST)
అమ‌లాపాల్ న‌టించిన తాజా చిత్రం ఆమె. రత్న కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రచార చిత్రాల్లో అమలాపాల్ నగ్నంగా కనిపించింది. దీంతో ఆమె ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. విశేషంగా ఆక‌ట్టుకున్న ఈ మూవీ ట్రైల‌ర్ ఈ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత పెంచింది. ఈ నెల 19న ఆమె ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఐతే మహిళా సంఘాల ఆందోళనతో మార్నింగ్ షోస్ రద్దు చేశారు.
 
ఇదిలా ఉంటే.. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన అమ‌లాపాల్‌ను న‌గ్న స‌న్నివేశాల గురించి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స్పందిస్తూ... తన తల్లికి ముందే చెప్పానని, స్క్రిప్టుకు ఖ‌చ్చితంగా అవసరమైతే నటించమని తన తల్లి చెప్పిందని అమల వెల్లడించారు. 
 
ఈ సినిమా శృంగార నేపథ్యంలో సాగేది కాదని, కంటెంట్ అర్థం కావాలంటే సినిమాను చూడాల్సిందేనని అమల తెలిపింది. ఈ చిత్రం నటిగా తనకు ఎంతో నమ్మకాన్నిచ్చిందని పేర్కొంది. తనకు ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చిందని ఆమె స్పష్టం చేసారు. అయితే.. త‌మిళ‌నాడులో అమ‌లాపాల్ న‌గ్న స‌న్నివేశాల గురించి ర‌చ్చ జ‌రుగుతోంది. 
webdunia
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ఆమె సినిమా యువతపై చెడు ప్రభావం చూపుతుందని తమిళనాడుకు చెందిన మంత్రి ప్రియా రాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమలా పాల్‌ పుదుచ్చేరి నుంచి వచ్చారని, ఆమెకు తమిళ ప్రజలపై కానీ, సంస్కృతిపై కానీ ఎలాంటి గౌరవం, ప్రేమ లేవని ఆరోపించారు. అమలాపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు కూడా కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పారని తెలియ‌చేసారు. మ‌రి.. చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేరుకే బ్రేక్ దర్శనం రద్దు... జరుగుతున్నదంతా సేమ్ టు సేమ్... ఎలా?