కార్యకర్త మరియు మోడల్ రెహనా ఫాతిమా తన మంచం మీద అర్ధనగ్నంగా పడుకున్న సమయంలో ఆమె పిల్లలు ఆమె శరీరంపై ఆర్ట్ గీస్తూ తీసిన వీడియో షేర్ చేశారు. ఈ వీడియోను 'బాడీ అండ్ పాలిటిక్స్' అనే పేరుతో యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. ఇది కాస్తా వివాదానికి దారితీసింది. ఈ వీడియోను చూసిన తిరువల్లాకు చెందిన న్యాయవాది అరుణ్ ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటి చట్టంలోని సెక్షన్ 67 (ఎలక్ట్రానిక్ ద్వారా లైంగిక అసభ్యకరమైన విషయాలను ప్రసారం), జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 (పిల్లల పట్ల క్రూరత్వానికి శిక్ష) కింద కేసు నమోదు చేశారు. ఆమెపై పోక్సో సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ కూడా ఉంది.
కార్యకర్త రెహనా ఫాతిమా, ఎప్పుడూ వివాదాస్పదమైనవి చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన తరువాత ఆమె మరింత ప్రాచుర్యం పొందింది.