Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిర్ చీఫ్ మార్షల్‌తో అభినందన్... మిగ్ 21లో చక్కర్లు

Advertiesment
Abhinandan Varthaman. Air Force Chief
, సోమవారం, 2 సెప్టెంబరు 2019 (17:38 IST)
భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మళ్లీ విధుల్లో చేరారు. భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాతో కలిసి మిగ్-21 యుద్ధ విమానంలో విహరించారు. విమానం ముందు భాగంలో ధనోవా కూర్చోగా, అభినందన్ మిగ్-21 వెనుక భాగంలో కూర్చున్నారు. 
 
పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌లో టేకాఫ్ తీసుకున్న ఈ మిగ్ ట్రైనీ విమానం దాదాపు అర్థగంటపాటు ఆకాశంలో విహరించింది. ఈ విహారం అనంతరం ధనోవా మీడియాతో మాట్లాడుతూ.. తాను అభినందన్ వర్థమాన్ తండ్రితో కలిసి పనిచేశానని గుర్తుచేశారు. 
 
కాగా, ఈ యేడాది ఫిబ్రవరి 26వ తేదీన పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే ఉగ్రస్థావరంపై భారత విమానాలు బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధవిమానాలు దూసుకురాగా, అభినందన్ ఓ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశారు. 
 
ఈ క్రమంలో అభినందన్ నడుపుతున్న మిగ్-21 విమానం దెబ్బతినడంతో పాక్ సైన్యానికి దొరికిపోయారు. అయితే భారత్ అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో అభినందన్‌ను పాకిస్థాన్ సురక్షితంగా ప్రాణాలతో విడుదల చేసింది.
 
ఈ వివాహం తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా మాట్లాడుతూ, వింగ్ కమాండర్ అభినందన్, తనకు మధ్య రెండు అంశాల్లో సారూప్యత ఉందన్నారు. తామిద్దరం విమానం కాక్ పీట్ నుంచి బయటపడ్డామని ధనోవా తెలిపారు.
 
అలాగే తాను కార్గిల్ యుద్ధంలో పోరాడితే, అభినందన్ బాలాకోట్ ఘటన తర్వాత పాక్ వైమానికదళంతో పోరాడాడని కితాబిచ్చారు. తాను, అభినందన్ తండ్రి వేర్వేరు స్క్వాడ్రన్లలో పనిచేశామని గుర్తుచేసుకున్నారు. అలాంటి వ్యక్తి కుమారుడితో కలిసి తన చివరి విమాన ప్రయాణం చేయడం నిజంగా గౌరవంగా భావిస్తున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా పేర్కొన్నారు. 
 
అభినందన్ తిరిగి 6 నెలల్లోనే విధుల్లో చేరడం సంతోషంగా ఉందన్నారు. 1988 సమయంలో తాను విమానం నుంచి ఎజెక్ట్ అయ్యాననీ, కానీ తిరిగి విధుల్లోకి చేరడానికి తనకు 9 నెలలు పట్టిందని చెప్పారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ దౌత్య విజయం : కుల్‌భాషణ్‌ను కలిసి అధికారులు