Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాస్కు వేసుకోలేదని కాళ్లూ చేతుల్లో మేకులు దించారు

మాస్కు వేసుకోలేదని కాళ్లూ చేతుల్లో మేకులు దించారు
, బుధవారం, 26 మే 2021 (20:23 IST)
బరేలీలోని ఒక వ్యక్తి పట్ల ఉత్తర ప్రదేశ్ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాస్క్ ధరించనందుకు తనను తీవ్రంగా కొట్టారని, తరువాత, చేతిలో, కాళ్ళలో ఇనుప మేకులను కొట్టారని ఆయన ఆరోపించారు. ఐతే ఈ సంఘటనను పోలీసులు ఖండిస్తున్నారు.
 
రంజిత్‌గా గుర్తించిన ఓ వ్యక్తి తన తల్లితో కలిసి ఎస్‌ఎస్‌పి కార్యాలయానికి చేరుకున్నాడు. ఐతే మాస్క్ ధరించలేదని కొడుకుతో అమానవీయంగా ప్రవర్తించారని అతని తల్లి ఆరోపించింది. ముగ్గురు పోలీసులు తన కొడుకును తీవ్రంగా కొట్టారనీ, తరువాత అతని చేతులు, కాళ్ళకు మేకులు కొట్టారని ఆమె ఆరోపించింది.
 
ఇదిలావుండగా, రంజిత్ పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, అబద్ధాలు చెబుతున్నాడని యుపి పోలీసు ఎస్ఎస్పి రోహిత్ సింగ్ సజ్వాన్ అన్నారు. అతను మాస్కు లేకుండా బయట బలాదూర్‌గా తిరుగుతున్నాడు. ఈ కారణంగా పోలీసులు అతనిపై 323, 504, 506 332, 353, 188, 269, 270 ఐపిసి సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో ఆ ఐదు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు.. మందులు సిద్ధం