Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగార్జున పాత ముద్దు గురించి ఇప్పుడెందుకు?

టాలీవుడ్ "మన్మథుడు" నాగార్జున ఎంత అందగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత అందగాడైనా కొన్ని సన్నివేశాలు చేసేటప్పుడు తనకంటూ పరిమితులుంటాయి. కానీ అలాంటి పరిధిని నాగ్ ఒకసారి దాటారట. ఎంతలా అంటే హీరోయిన్‌ను గాఢంగా ముద్దాడేంతలా. 1989వ సంవత్సరంలో మణిరత్నం ద

Advertiesment
nagarjuna kissing scene
, శుక్రవారం, 23 జూన్ 2017 (12:44 IST)
టాలీవుడ్ "మన్మథుడు" నాగార్జున ఎంత అందగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత అందగాడైనా కొన్ని సన్నివేశాలు చేసేటప్పుడు తనకంటూ పరిమితులుంటాయి. కానీ అలాంటి పరిధిని నాగ్ ఒకసారి దాటారట. ఎంతలా అంటే హీరోయిన్‌ను గాఢంగా ముద్దాడేంతలా. 1989వ సంవత్సరంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన "గీతాంజలి" సినిమాలో జరిగింది. అప్పుడు వచ్చిన ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఎన్నారై "గిరిజా షెట్టార్" హీరోయిన్‌గా చేసింది. 
 
ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు ఇద్దరూ కేన్సర్ పేషెంట్‌లుగా నటించారు. వారిద్దరూ తమ ప్రేమలను వ్యక్త పరుచుకునే సమయంలో వచ్చే "ఓం నమః" అనే పాటలో 4 నిమిషాల పాటు ఒకరినొకరు ముద్దాడుతారు. ఆ సమయంలో నాగార్జున గానీ, హీరోయిన్ గానీ ఎలాంటి బిడియం లేకుండా, ఇబ్బంది పడకుండా చాలా బోల్డ్‌గా నటించారు. ఇందులో ఎలాంటి గ్రాఫిక్స్ జోడించలేదు. వారు పాటలోనే అంతసేపు నటించారంటే ఇక షాట్‌ల మధ్యలో అలా ఎంతసేపు ఉండవలసి వచ్చిందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. 
 
ఇప్పటి చిత్రాలలో ఇలా జరగడం అరుదుగా ఉంటుంది. అది కూడా గ్రాఫిక్స్ చేసేస్తున్నారు. ఒకవేళ అలాంటి సన్నివేశాలు చేయాల్సి వస్తే హీరోయిన్‍లు భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా "గీతాంజలి" సినిమా విజయవంతమై జాతీయ పురస్కారం గెలుచుకుందంటే, వారికి నటన పట్ల ఉన్న అంకితభావం వలనే సాధ్యమైందని మనకు సుస్పష్టంగా అర్థమవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ రిలీజ్.. జోగేంద్రగా జీవించిన రానా.. కాజల్‌తో రొమాన్స్ అదుర్స్ (వీడియో)