నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ రిలీజ్.. జోగేంద్రగా జీవించిన రానా.. కాజల్‌తో రొమాన్స్ అదుర్స్ (వీడియో)
'నేనే రాజు నేనే మంత్రి' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియా ద్వారా ట్రైలర్‌ను దర్శకుడు తేజ విడుదల చేశారు. దీనిని హీరో రానా షేర్ చేశారు. నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సొంత పతాక
'నేనే రాజు నేనే మంత్రి' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియా ద్వారా ట్రైలర్‌ను దర్శకుడు తేజ విడుదల చేశారు. దీనిని హీరో రానా షేర్ చేశారు. నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సొంత పతాకంపై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రానా సరసన కాజల్ అగర్వాల్, కేథరిన్ నటిస్తున్నారు. బాహుబలిలో భల్లాలదేవుడిగా కనిపించిన రానా.. జోగేంద్రగా ఇందులో కనిపిస్తున్నాడు.
యాక్షన్ అండ్ రొమాన్స్ పండించే హీరోగా రానా ఇందులో కనిపించనున్నాడు. జోగేంద్రగా తన క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు. పంచెకట్టులో రానా లుక్, డైలాగ్స్ సూపర్బ్ అనిపించాయి. కాజల్‌తో రొమాన్స్ సీన్స్, డైలాగ్ డెలివరీ అదిరింది. ఇక కేథరిన్ సిగరెట్టు కాల్చుతూ కనిపించింది. అలాగే తనికెళ్ల భరణి, అశుతోష్ రానా, కాజల్ అగర్వాల్, కేథరిన్, నవదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది.