Publish Date: Sat, 16 May 2015 (20:33 IST)
Updated Date: Sat, 16 May 2015 (20:37 IST)
భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న బాహుబలి చిత్రంలో ఆస్లాంఖాన్ గా కన్నడ నటుడు సుదీప్ నటించారు. ఈ పోస్టర్ ను శనివారం సాయంత్రం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశారు. సోషల్ మీడియా ద్వారా పోస్టర్ ను విడుదల చేశారు.
రాజమౌళి నిర్మించిన హిట్ చిత్రం ఈగలో విలన్ పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందిన సుదీప్ అస్లాంఖాన్ గా తన విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నాడు. మొదట్లో చిన్న అతిథి పాత్రకు ఒప్పుకున్న సుదీప్ రాజమౌళి వినతి మేరకు అస్లాంఖాన్ గా పాత్ర పోషించారు. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.