Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిషా సింగ్ నిర్మిస్తున్న రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ యు & మి

Advertiesment
Nisha Singh, Siva Kovelkar
, మంగళవారం, 30 ఆగస్టు 2022 (11:31 IST)
Nisha Singh, Siva Kovelkar
నిషా సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు శివ కోవెల్కర్ దర్శకత్వంలో నిషా సింగ్ నిర్మిస్తున్న చిత్రం YOU & ME. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర ట్రైలర్‌ను  ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసి రెడ్డి విడుదల చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..యు & మి చిత్రం ట్రైలర్ , పాటలు, బాగున్నాయి. ట్రైలర్ చూస్తుంటే థ్రిల్లర్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా  ఉన్నట్టు అనిపిస్తుంది.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
 
నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి మోహన్ వడ్ల పట్ల మాట్లాడుతూ.. హీరోయిన్ నిషా సింగ్ సినిమాపై ప్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది.రొమాన్స్ థ్రిల్లర్ వంటి మంచి కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
 
webdunia
Nisha Singh, Mohan Vadla Phala, Tummala Ramasatyanarayana and others
చిత్ర నిర్మాత,హీరోయిన్ నిషా సింగ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి కొత్తగా  వచ్చిన నాకు ఇంతమంది పెద్దలు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు వారికి నా ధన్యవాదాలు.  కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులకు చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడకుండా అదరిస్తారు. ప్రొడక్షన్ పరంగా ఇబ్బంది ఉన్నా ఈ సినిమాకు వర్క్ చేసిన నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేసి సపోర్ట్ చేశారు.దర్శకుడు  శివ గారు మంచి కాన్సెప్ట్ ఉన్న కథను నాకందించారు తన సపోర్ట్ మరువలేనిది రొమాంటిక్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
చిత్ర దర్శకుడు  శివ కోవెల్కర్ మాట్లాడుతూ..ఈ చిత్ర హీరోయిన్ నిషా  ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం. తను మంచి కథ ఉంటే చెప్పమంది. నేను చెప్పిన లైన్ నచ్చడంతో ఇందులో హీరోయిన్‌గా నటిస్తూ ఈ సినిమాను తనే ప్రొడ్యూస్ చేస్తుంది.ఒక సినిమా చేయడం అంటే ఎంత కష్టమో  మనందరికీ తెలుసు అలాంటిది.ఇక్కడ తనకు బాషా రాకున్నా కథను  నమ్మి తెలుగు సినిమా చేయడం చాలా గ్రేట్. అందుకు నిషాకు ధన్యవాదాలు.అలాగే ఇదే ప్రొడక్షన్ లో సెప్టెంబర్ లో ఒక మూవీ స్టార్ట్ అవుతుంది. ఏర్ సినిమాకు డి. ఓ. పి ప్రసాద్ గారు ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడు. లొకేషన్స్ ను చాలా అందంగా చూయించారు. అలాగే వెంకట్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.. మంచి కథతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు
 
నిర్మాత తుమ్మల రామసత్యనారాయణ  మాట్లాడుతూ..యు & మి చిత్రం ట్రైలర్  చాలా బాగుంది.ఈ సినిమాలో హీరోయిన్ ఇంతకు ముందు ఉన్న రంభ లాగుంది. తను ఇంకా ఎన్నో చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను.చిత్ర దర్శకుడు  శివ కోడి రామకృష్ణ గారి దగ్గర చాలా సినిమాలకు కో డైరెక్టర్  గా వర్క్ చేశాడు.తను చేసిన ఈ ప్రయత్నం బాగుంది.ట్రైలర్ చూస్తుంటే ఇందులో క్రైమ్, రొమాన్స్, థ్రిల్లర్, హార్రర్ ఇలా ప్రేక్షకుల కావాల్సిన అన్నీ అంశాలు ఇందులో ఉన్నాయిత్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా తర్వాత హీరోయిన్ మరిన్ని చిత్రాలు నిర్మించాలని  కోరుతున్నాను అన్నారు.
 
 ఇంకా ఈ కార్యక్రమం క్రమంలో నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి మోహన్ వడ్ల పట్ల, నిర్మాత తుమ్మల రామసత్య నారాయణ, దర్శకులు సాయి కిరణ్ తదితరులతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. ట్రైలర్ విడుదల అనంతరం ముఖ్య అతిది గా వచ్చిన
 
సాంకేతిక నిపుణులు-  బ్యానర్ : యన్. ఆర్. ప్రొడక్షన్,  నిర్మాత : నిషా సింగ్,  స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ : శివ కోవెల్కర్,  డి. ఓ. పి : ప్రసాద్, మ్యూజిక్ : వెంకట్, పి. ఆర్ ఓ : మధు వి. ఆర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్పతో సుడి తిరిగిందనుకుంటే.. రష్మికకు ఆ ఛాన్స్ మిస్సయ్యిందే..