Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్లీ ఇలాంటి సినిమా, ఇలాంటి పాత్ర దొరకదు.. బాహుబలిపై రానా ఉద్వేగం

జీవితంలో బాహుబలి సినిమా మళ్లీ వస్తుందని కానీ, ఇంలాటి పవర్ పుల్ పాత్ర మళ్లీ తనకు దొరుకుతుందని కానీ తనకయితే నమ్మకం లేదని, ఏదేమైనా ఒక చరిత్రలో నిలబడనున్న అత్యద్భుత సినిమాలో నటించామన్ని తృప్తి మాత్రం మిగిలే ఉంటుందని రానా పేర్కొన్నాడు.

మళ్లీ ఇలాంటి సినిమా, ఇలాంటి పాత్ర దొరకదు.. బాహుబలిపై రానా ఉద్వేగం
హైదరాబాద్ , సోమవారం, 27 మార్చి 2017 (02:44 IST)
వాళ్లు.. భారత చలనచిత్ర చరిత్రలో ఒక అత్యద్భుత ఘటనకు పాత్రధారులు, సాక్షీభూతులు. అయిదేళ్ల ఒకే సినిమాకు పనిచేయడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఒక సినిమాకు అన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు కట్టుబడి ఉండడంలోని కష్టం ఏమిటో, అది కలిగించే మానసిక ఒత్తిడి ఎంటో తెలిసినవారు. అందులోనూ పర్‌ఫెక్షనిజానికి మారుపేరుగా నిలిచిన రాజమౌళి పెట్టే ఒత్తిడిని అనుభవించినవారు. ఎన్ని బాధలు పడ్డా ఒక మహాయజ్ఞంలాంటి అత్యుత్తమ చిత్రంలో పాలు పంచుకున్నారు. బాహుబలి 2  ప్రీ-రిలీజ్ కూడా పూర్తి కావటంతో ఇక ఈ రెండు భాగాల సినిమాతో అనుబంధం వీరికి నటనా పరంగా దూరమైనట్లే.
 
ఆ బాధను అందరికంటే ఎక్కువగా అనుభవిస్తున్నవాడు దగ్గుబాటి రానా. జీవితంలో బాహుబలి సినిమా మళ్లీ వస్తుందని కానీ, ఇంలాటి పవర్ పుల్ పాత్ర మళ్లీ తనకు దొరుకుతుందని కానీ తనకయితే నమ్మకం లేదని,  ఏదేమైనా ఒక చరిత్రలో నిలబడనున్న అత్యద్భుత సినిమాలో నటించామన్ని తృప్తి మాత్రం మిగిలే ఉంటుందని రానా పేర్కొన్నాడు. బాహుబలి-2 ప్రీ రిలీజ్ సందర్భంగా ఆదివారం రామోజీ ఫిలిం సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రానా తన వంతు వచ్చినప్పుడు మాట్లాడుతూ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
ఇలాంటి సినిమాలో మళ్లీ తమకు అవకాశం వస్తుందనే ఆశ లేకున్నా. ఈ రోజునుంచి ఏప్రిల్ 28 వరకు అంటే బాహుబలి-2 విడుదల అవుతున్న రోజు వరకు అయిదే్ళ్లుగ బాహుబలికి చెందిన మాహిష్మతి సామ్రాజ్యంలో తాను గడిపిన విశేషాలను ఎవ్వరడిగినా చెబుతూ పోతానని ఉద్వేగంగా చెప్పాడు రానా. అయితే తాను జీవితంలో ఎన్ని సినిమాలు తీసినా తన ఫేవరేట్ కో స్టార్ మాత్రం ప్రభాసే అవుతాడంటూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుకున్నాడు రానా.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళి ప్రజ్ఞాపాటవాల్లో పది శాతం నాకు లేదు: మనస్పూర్తిగా ఒప్పుకున్న కరణ్ జోహార్