Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజమౌళి ప్రజ్ఞాపాటవాల్లో పది శాతం నాకు లేదు: మనస్పూర్తిగా ఒప్పుకున్న కరణ్ జోహార్

బాహుబలి వంటి మెగా ప్రాజెక్టులో ఒక చిన్న భాగం చేపట్టేందుకు అంగీకరించినందుకుగాను ఆ చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు బాలీవుడ్ సుప్రసిద్ధ నిర్మాత కరణ్ జోహార్ పేర్కొన్నారు. బాహుబలి చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి ఉన్న ప్రజ్ఞాపాటవాల్లో కనీసం పది శా

రాజమౌళి ప్రజ్ఞాపాటవాల్లో పది శాతం నాకు లేదు: మనస్పూర్తిగా ఒప్పుకున్న కరణ్ జోహార్
హైదరాబాద్ , సోమవారం, 27 మార్చి 2017 (02:03 IST)
బాహుబలి వంటి మెగా ప్రాజెక్టులో ఒక చిన్న భాగం చేపట్టేందుకు అంగీకరించినందుకుగాను ఆ చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు బాలీవుడ్ సుప్రసిద్ధ నిర్మాత కరణ్ జోహార్ పేర్కొన్నారు. బాహుబలి చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి ఉన్న ప్రజ్ఞాపాటవాల్లో కనీసం పది శాతం కూడా తనకు లేదని కరణ్ అంగీకరించారు. బాహుబలి హిందీ వెర్షన్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న కరణ్ జోహార్ చలన చిత్ర చరిత్రలో ఇంతవరకు తీసిన చిత్రాల్లో అత్యుత్తమ చిత్రంగా బాహుబలిపై ప్రశంసల వర్షం కురిపించారు.


 
ఆదివారం హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలో భారీ స్థాయిలో నిర్వహించిన బాహుబలి-2 ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో కరణ్ జోహార్ పాల్గొన్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఇది అతిపెద్ద ఈవెంట్ అని కరణ్ వ్యాఖ్యానించారు. బాహుబలి-2 ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతున్నానన్నారు. చిత్ర నిర్మాణం పట్ల అంకిత భావం అంటే ఇదే. ఇది చిత్ర నిర్మాణ, దర్శకుల అసలు బలానికి సంకేతం ఇదే అన్నారు. తాను ముంబై వెళ్లాక దీనిగురించే బాలీవుడ్‌కి చెబుతానన్నారు.
 
కరణ్ జోహార్ హాజరైన సందర్భంగా బాహుబలి నిర్మాతలు కరణ్ కెరీర్ విశేషాల గురించి ప్రత్యేక ఆడియో-వీడియోను ప్రదర్శించారు. తనపై ఆడియో-వీడియోను ఇక్కడ ప్రదర్శించడం తనకు మాటలు రాకుండా చేసిందని కరణ్ చెప్పారు. 
 
భారతీయ వెండితెరపై 67 సంవత్సరాల క్రిత ముఘల్-ఇ-అజమ్ సినిమా సృష్టించిన మ్యాజిక్‌ను బాహుబలి ఇప్పుడు తోసిపుచ్చిందని కరణ్ ప్రశంసించారు. రాజమౌళి సినిమాకు ఆత్మ ఉంటుంది. తన వ్యక్తిత్వంలో అపారమైన ప్రజ్ఞ ఉంది. దాంట్లో కనీసం 10 శాతం ప్రజ్ఞ కూడా తనకులేదని కరణ్ జోహా్ర్ పేర్కొన్నారు. 
 
బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ దేశంలోనే అతి సంక్లిష్టమైన బాలీవుడ్ పరిశ్రమను బాహుబలితో జయించడంలో తమకు సహకరించిన కరణ్‌ జోహార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బాహుబలిని తెలుగు పరిశ్రమ నుంచి బయటకు తీసుకెళ్లేందుకు తాము కరణ్ వద్దకు వెళ్లాం. బాహుబలి సినిమా చూడగానే దాంట్లో ఉన్న పటిమను కరణ్ గ్రహించారు. సినిమాను తాను విశ్వసించడమే కాకుండా, తన పేరును కూడా దానికి జోడించారు. అందుకే మేం బాలీవుడ్‌ మార్కెట్‌ని జయించగలిగాం. మా ప్రయాణంలో తోడుగా ఉన్నందుకు థ్యాంక్యూ కరణ్ అని శోభు చెప్పారు. 
 
బాహుబలి-2 సినిమా ఏప్రిల్ 28న  విడుదల కానుంది. కట్టప్ప బాహుహలిని ఎందుకు చంపాడు అంటూ కోట్లమంది వేస్తున్న ప్రశ్నకు ఆ రోజు సమాధానం దొరకనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వై కట్టప్పా కిల్డ్ బాహుబలి ప్రశ్నను మించిన సంచలనం ఇప్పుడు వైరల్..?