Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాస్ అండ్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా రాఘవ రెడ్డి

Advertiesment
Shiva Kanthaneni - Rashi - Nandita Swetha
, గురువారం, 21 డిశెంబరు 2023 (17:03 IST)
Shiva Kanthaneni - Rashi - Nandita Swetha
శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో K. S.  శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం మేకర్స్ విడుదల చేశారు. 
 
https://youtu.be/sv5FvaN-CHY
 
‘రాఘవ రెడ్డి’ ట్రైలర్‌ను గమనిస్తే.. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఫార్మేట్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన కథానాయకుడు.. తప్పు  జరిగితే సహించని అతని వ్యక్తిత్వం కారణంగా డ్యూటీ పరంగా మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలేంటి? నిజాయతీగా ఉండటం వల్ల తను ఏం పోగొట్టుకున్నాడు? డ్యూటీలో తనెంత సిన్సియర్‌గా ఉంటాడు.. విలన్స్‌ని హీరో ఎలా భరతం పడతాడు.. ఇలాంటి ఎమోషనల్, యాక్షన్ అంశాలతో రాఘవరెడ్డి సినిమాను తెరకెక్కించారని అర్థమవుతుంది. 
 
శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత, పోసాని, అజయ్ ఘోష్, అజయ్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి వంటి స్టార్స్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. సంజీవ్ మేగోటి - సుధాకర్ మారియో సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రానికి ఎస్.ఎన్.హరీష్ సినిమాటోగ్రఫీ అందించారు. కె.వి.రమణ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 
 
నటీనటులు :- 
శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, BHEL ప్రసాద్, మీనా వాసు, విజయ్ భాస్కర్, తేలు రాధాకృష్ణ, రాఘవరెడ్డి  తదితరులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊరు పేరు భైరవకోన కోసం మంత్రదండం పట్టుకున్న సందీప్ కిషన్