మహిళలను కించపరిచే సినిమా యానిమల్ అంటూ విమర్శలు

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

మహిళలను కించపరిచే సినిమా యానిమల్ అంటూ విమర్శలు

Advertiesment
animal latest poster
, శుక్రవారం, 8 డిశెంబరు 2023 (12:34 IST)
animal latest poster
రణబీర్ కపూర్, రష్మిక మందన్నా నటించిన యానిమల్ సినిమా సునామిలా కలెక్షన్లు రాబడుతుంది. రజనీకాంత్ జైలర్ ను మించిన కలెక్షన్లు విశ్వవ్యాప్తంగా వస్తున్నాయి.  డిసెంబర్ 1 న విడుదలైన యానిమల్ కు ఇప్పటికీ 500 కోట్లకు చేరిందని చిత్ర యూనిట్ తెలియజేస్తుంది. ఇంత వసూళ్ళు రాబడుతుంది కేవలం యువతీ యువకుల ఆదరణ వల్లే. అందుకే పలువురు మేథావులు ఈ సినిమాను చూసి విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగులోనూ పలువురు సెలబ్రిటీలు విమర్శలు గుప్పించినా కథానాయకుడు నాని మాత్రం సూపర్ మూవీ అంటూ కితాబిచ్చాడు.
 
కాగా, ఈ సినిమాపై టీమ్ ఇండియా క్రికెటర్ జయదేవ్ కూడా విమర్శలు గుప్పించారు. తాజాగా బాలీవుడ్ లో లగే రహో మున్నా భాయ్ చిత్రంలోని "బందే మే థా దమ్... గీతాన్ని రాసిన గాయకుడు, రచయిత, సహాయ దర్శకుడు, నటుడు స్వానంద్ కిర్కిరే తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తన సోషల్ మీడియాలో మహిళలను ఉద్దేశించి మాట్లాడారు.
 
ఈ సినిమా చూసి మహిళలు రష్మిక మందన్న వచ్చినప్పుడల్లా క్లాప్స్ కొడుతుంటే, మహిళలపై జాలేసింది. మీ కోసం కొత్త వ్యక్తి వచ్చాడు. అలాంటి వారితో మీకు గౌరవం రాదు. ఇకపై ఎవరూ ఇవ్వరు. మిమ్మల్ని అణచివేత వేసే వ్యక్తి గురించి మీరు గర్వపడుతున్నారు. థియేటర్ లో రష్మికను చూసి మహిళలు చప్పట్లు కొడుతుంటే నిరాశతో బాధతో వచ్చేసా అంటూ ట్వీట్ చేశాడు.
 
దీనిని చూశాక యామినల్ యూనిట్ రిప్లయి ఇచ్చింది. మీ మోకాళ్ళను మీ కాలి ముందు పడనివ్వకండి. మీ భుజం పాదాలు వేరువేరుగా వుంచండి .అప్పుడు బ్యాలెన్స్ గా నిలబడగలరు. అంటూ చిత్రమైన కౌంటర్ ఇచ్చింది. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ఇతను తెలంగాణాకు చెందిన ఎన్.ఆర్.ఐ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాకింగ్ స్టార్ య‌ష్‌ భారీ బ‌డ్జెట్ మూవీకి టాక్సిక్ ఖరారు