Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lavanya Tripathi : టన్నెల్ ట్రైలర్ లో లావణ్య త్రిపాఠి, అధర్వ మురళీ కాంబో అదిరింది

Advertiesment
Lavanya Tripathi, Atharva Murali

దేవీ

, గురువారం, 4 సెప్టెంబరు 2025 (18:08 IST)
Lavanya Tripathi, Atharva Murali
అథర్వా మురళీ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకున్నాడoటే బ్లాక్ బస్టర్ పక్కా అన్నట్టే. ప్రస్తుతం అథర్వా యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ జానర్‌లో ‘టన్నెల్‌’ అనే మూవీని చేశారు. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీని తెలుగులోకి ఎ.రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు.
 
తాజాగా ట్రైలర్ విడుదల చేసి అంచనాలు పెంచేశారు. 'యూనిఫామ్ వేసుకున్న తరువాత అందరూ ఫ్యామిలీనే' అని ట్రైలర్ లో హీరో చెప్పిన డైలాగ్ చూస్తే టన్నెల్ సినిమా ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. ఇక ఇందులో సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో లవ్ ట్రాక్ కి కూడా అంతే ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి, అధర్వ కాంబో అందరినీ అలరించేలా ఉంది. గ్రిప్పింగ్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో ట్రైలర్‌ను కట్ చేశారు.  
 
జస్టిన్ ప్రభాకరన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. శక్తి శరవణన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. కలైవానన్ ఈ సినిమాకు ఎడిటర్. తెలుగు వెర్షన్ ప్రమోషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. అథర్వా మురళీ తెలుగు ప్రమోషన్స్‌లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మదరాసి చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా : శివకార్తికేయన్