Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దసరా టీజర్‌ లో లాస్ట్ షాట్ ఈజ్ తోపే: ఎస్ ఎస్ రాజమౌళి

nani action scene
, సోమవారం, 30 జనవరి 2023 (17:43 IST)
nani action scene
నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ చిత్రం కూడా యూనివర్సల్ అప్పీల్ వున్న చిత్రం. ఇప్పుడు విడుదలైన సినిమా టీజర్ కూడా అదే సూచిస్తుంది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘దసరా’ ‘రా’, రస్టిక్, ఇంటెన్స్ టీజర్ ను లాంచ్ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, దసరా టీజర్ ఎంతో బాగుంది. నాని మేకోవర్ కు ఇంప్రెస్స్ అయ్యాను. కొత్త డైరెక్టర్ క్రియేషన్ చాలా నచ్చింది. లాస్ట్ షాట్ ఈజ్ తోపే.. అంటూ ట్వీట్ చేసారు. 
 
చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే పండుగ దసరాను భారతదేశం అంతటా చాలా ఆనందం ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ పండుగలో రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని చూపించే సినిమా దసరా. టీజర్‌ను బట్టి చూస్తే  కంటెంట్ ఒరిజినల్, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
 
నటీనటుల మేకోవర్‌లు, బొగ్గు గనుల్లో పనిచేసే వ్యక్తుల ప్రపంచాన్ని చూపించడం, వారు అనుసరించే ఆచారాల వరకు.. దసరా టీజర్ సరికొత్త అనుభూతిని అందిస్తుంది. మొదటి ఫ్రేమ్‌లో ధరణి (నాని) భారీ రావణుడి దిష్టిబొమ్మ ముందు నిలబడి ఉన్నట్లు ప్రజంట్ చేశారు. ‘’వీర్లపల్లి.. సుట్టూర బొగ్గు కుప్పలు. తొంగి చూస్తే కానీ కనిపించని వూరు. మందు అంటే మాకు వ్యసనం కాదు. అలవాటు పడిన సాంప్రదాయం’ అని నాని వాయిస్ తో టీజర్ మొదలైయింది. ధరణి ప్రపంచం చాలా వైల్డ్ ఉంది . కొన్ని దుష్టశక్తులు గ్రామంలో సామరస్యానికి భంగం కలిగించినప్పుడు అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.
 
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని కలసి  ఒక అద్భుతాని అందించారు. శ్రీకాంత్ ఓదెల పనితనం చూస్తే అతను ఒక కొత్త దర్శకుడని అనిపించడం లేదు.  కథానాయకుడు,  ప్రతినాయకుల వీరత్వాన్ని దృశ్య, సంగీత పరంగా అద్భుతంగా ప్రజంట్ చేశారు ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వుంది. నాని క్యారెక్టర్‌లోని కీలకమైన అంశాలను గ్రేట్ యీజ్ తో ప్రజంట్ చేశారు
 
టీజర్ లో నాని ర్యాంపేజ్ మనం చూస్తాం. అతని క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్,  బాడీ లాంగ్వేజ్ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ధరణి ట్రాన్స్‌లోకి కూడా తీసుకువెళతాయి. అతను బీడీ వెలిగించే విధానం, మద్యం సేవించిన తర్వాత అతను చేసే సంబరాలు జనాలకు గూస్‌బంప్స్‌ని ఇస్తాయి. చివరి ఎపిసోడ్‌లో నాని తన వేలు కత్తికి రాజుకుంటూ రక్తం నుదుటిపై పెట్టుకోవడం అతని తిరుగుబాటు వైఖరిని తెలియజేస్తుంది. షైన్ టామ్ చాకో, సాయి కుమార్ 
 
హీరో నాని మాట్లాడుతూ.. దసరా నాకు చాలా స్పెషల్ మూవీ. మార్చి 30 న అందరూ దసరా గురించి మాట్లాడుకుంటారు. అది తప్పితే మరో టాపిక్ వుండదు.  తెలుగు సినిమా గురించి నా కాంట్రిబ్యూషన్ ఏమిటని చాలా సార్లు ఆలోచించే వాడిని. చాలా గర్వంగా ఒక మాట చెబుతున్నాను. తెలుగు, ఇండియన్ సినిమాకి ఈ ఏడాది నా తరపున నుండి బిగ్గెస్ట్ ట్రిబ్యూషన్..  శ్రీకాంత్ ఓదెల. అది ఎందుకో, ఎలాంటి సినిమా తీశాడో మార్చి 30న తెలుస్తుంది. టీజర్ జస్ట్ సాంపిల్ మాత్రమే. సినిమా అదిరిపోతుంది.. నెక్స్ట్ లెవల్ లో వుంటుంది.  గత ఏడాది తెలుగు సినిమా నుండి ఆర్ఆర్ఆర్ వచ్చిన కన్నడ నుండి కేజీఎఫ్ వచ్చింది. చాలా నమ్మకంగా చెబుతున్నాను.. 2023లో తెలుగు సినిమా నుంచి వస్తుంది దసరా. సినిమా విడుదల తర్వాత కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. మార్చి 30 థియేటర్ లో కలుద్దాం’’ అన్నారు.


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమా తరువాత ఒక విషయం అర్థమైంది : మణిశర్మ