Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నల్లమల ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌ తో కలియుగం పట్టణంలో ట్రైలర్

Advertiesment
Kaliyuga pattanamlo Trailer event

డీవీ

, మంగళవారం, 19 మార్చి 2024 (13:47 IST)
Kaliyuga pattanamlo Trailer event
‘వీడు ఉండాల్సింది ఇక్కడ కాదు.. మెంటల్ హాస్పిటల్‌లో’ అంటూ సాగే ఈ ట్రైలర్‌లో యాక్షన్, లవ్, క్రైమ్, థ్రిల్లర్ ఇలా అన్ని అంశాలను చూపించారు. నంద్యాలలో జరిగే హత్యల చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. నల్లమల ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఏదో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను అల్లుకుని కథను రాసినట్టుగా కనిపిస్తోంది.‘ ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు పుట్టలేదమ్మా’ అని హీరో చెప్పే ఎమోషనల్ డైలాగ్ బాగుంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కలియుగం పట్టణంలో ట్రైలర్ విడుదలైంది.
 
చిత్ర నిర్మాతలు కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ మాట్లాడుతూ.. ‘మా కలియుగం పట్టణంలో సినిమా అంతా కూడా కడపలోనే తీశాం. దర్శకుడు రమాకాంత్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాం. మా సినిమా చాలా బాగా వచ్చింది. మా హీరో విశ్వ కార్తికేయ మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఆయుషి పటేల్ పాత్రకు ప్రాణం పోశారు. మా చిత్రం మార్చి 29న విడుదల కానుంది. మా సినిమాను ప్రేక్షకులు చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమాలో క్రైమ్ ఉంటుంది. అలా అని స్టూడెంట్స్ దాన్ని ఫాలో అవ్వొద్దు. మా సినిమాకు నిర్మాత నాని గారు ముందు నుంచి సపోర్ట్‌గా నిలిచారు. హీరో విశ్వ కార్తికేయ, హీరోయిన్ ఆయుషి పటేల్ అద్భుతంగా నటించారు. మా మూవీ మార్చి 29న రాబోతోంది. ప్రేక్షకులు మా సినిమాను చూసి ఆదరించాలి’ అని అన్నారు.
 
 విశ్వ కార్తికేయ మాట్లాడుతూ.. ‘కలియుగం పట్టణంలో ప్రతీ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో అన్ని జానర్లను ప్రేక్షకులు ఎక్స్‌పీరియెన్స్ చేయబోతున్నారు. ఇది కచ్చితంగా ఓ యూనిక్ పాయింట్. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా కడప ప్రజలు, పోలీసుల నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. మార్చి 29న రాబోతోన్న మా సినిమాను ఆడియెన్స్ ఆదరించి విజయవంతం చేయాలి’ అని అన్నారు.
 
 ఆయుషి పటేల్ మాట్లాడుతూ.. ‘మా టీం అంతా కలిసి సినిమా షూటింగ్ ఎంతో సరదాగా చేశాం. కడపలో ఎంతో కంఫర్టబుల్‌గా షూట్ చేశాం. మా హీరో విశ్వ కార్తికేయ ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. విశ్వకు సినిమాలంటే ప్రాణం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. మా సినిమా మార్చి 29న రాబోతోంది. అందరూ ఆదరించండి’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రచయితగా పదును పెడుతున్న అడవి శేష్