Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే సమయం ఇదిః మైఖేల్ టీజర్ సంద‌ర్భంగా సందీప్ కిష‌న్‌ (video)

Advertiesment
Sandeep Kishan,  Divyansha Kaushik, Pushkur Ram Mohan Rao, Ranjith Jayakodi
, గురువారం, 20 అక్టోబరు 2022 (19:58 IST)
Sandeep Kishan, Divyansha Kaushik, Pushkur Ram Mohan Rao, Ranjith Jayakodi
సందీప్ కిషన్ , రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకక్కుతున్న తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ తో ప్రేక్షకులకు థ్రిల్ చేయబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కబోతుంది.  ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి,  పుస్కూర్ రామ్ మోహన్ రావుల సంయుక్త ప్రొడక్షన్ వెంచర్  ‘మైఖేల్’. దివంగత శ్రీ. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు.
 
ఈరోజు ఈ చిత్రం తెలుగు టీజర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేయగా, ధనుష్ తమిళ వెర్షన్‌ను, దుల్కర్ సల్మాన్ మలయాళ వెర్షన్‌ను, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి విడుదల చేశారు.  హిందీ టీజర్‌ను రాజ్ కుమార్ రావ్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్, రాజ్ & డీకే విడుదల చేశారు.
 
టీజర్ 'మైఖేల్' యొక్క ముఖ్యమైన గ్లింప్స్ ని రివిల్ చేసింది.అలాగే, విజయ్ సేతుపతి పాత్రతో పాటు గౌతమ్ మీనన్ విలనిజం ఆవిష్కరించింది. 80 నేపధ్యంలో సాగే ఈ కథలో  నటీనటుల గెటప్‌లు, నాటి పరిస్థితులు అద్భుతంగా రిక్రియేట్ చేశారు.
 
టీజర్ సినిమాలోని మూడు ప్రముఖ పాత్రలనిపరిచయం చేస్తూ  ప్రారంభమవుతుంది. ''వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి మైఖేల్' అని మాస్టర్ చెప్పగా .. 'వెంటాడి ఆకలి తీర్చుకోవడానికి వేటాడటం తెలియాల్సిన పని లేదు మాస్టర్'' అని మైఖేల్ బదులు ఇవ్వడం టెర్రిఫిక్ గా వుంది.
 
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి , గౌతమ్ మీనన్ ల రగ్గడ్ డాషింగ్  గెటప్స్, అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్‌లు, ఇంటెన్స్ డైలాగులు, స్టీమీ రొమాన్స్ ఇవన్నీ క్యూరియాసిటీని పెంచుతూ సినిమా పూర్తి వినోదాత్మక ప్యాకేజీగా కనిపిస్తోంది.
 
టీజర్‌లో పిల్లవాడి కాళ్లు, దాని పోర్ట్రెయిట్, గాడ్ మాన్ వంటి కొన్ని రహస్య అంశాలు కూడా ఉన్నాయి. సందీప్ కిషన్ తన వైల్డ్ సైడ్‌ను చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లు మైండ్ బ్లోయింగా వున్నాయి. తనను తాను బీస్ట్ మోడ్‌గా మార్చుకుని, కండలు తిరిగిన దేహంతో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా కనిపించాడు సందీప్ కిషన్.
 
రొమాంటిక్ ట్రాక్ ని కూడా యాక్షన్ పార్ట్ లా చూపించడం ఆసక్తికరంగా వుంది. టీజర్ లో సందీప్ కిషన్ , దివ్యాంశ కౌశిక్ మధ్య లిప్-లాక్ సీక్వెన్స్ కూడా చూపించారు. విజయ్ సేతుపతి  లుక్,  పవర్ ప్యాక్డ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో టెర్రిఫిక్ అనిపించాడు. గౌతమ్ మీనన్ మాన్ స్టార్ గా కనిపించాడు. . టీజర్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ , అనసూయ భరద్వాజ్‌లు కూడా మెరిసారు.
 
రంజిత్ జయకోడి తన ప్రత్యేకమైన స్టోరీ టెల్లింగ్ తో  మనల్ని వేరే  ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు. కిరణ్ కౌశిక్ యొక్క అవుట్ స్టాండింగ్ విజువల్స్ , సామ్ సిఎస్ క్ అద్భుతమైన నేపథ్య సంగీతం టీజర్ ని మరింత ఆకర్షిణీయంగా మార్చాయి. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి ,  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి నిర్మాణ విలువలు అత్యున్నతంగా వున్నాయి. తెలుగు వెర్షన్‌కి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాశారు. ‘మైఖేల్’ ని థియేటర్ లో చూడాలనే క్యూరియాసిటీ ని ప్రేక్షకుల్లో భారీ పెంచింది టీజర్.
 
టీజర్ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నాకు నేనుగా పెట్టుకున్న అతి పెద్ద టెస్ట్ ‘మైఖేల్’. మూడేళ్ళ క్రితం నుండి ‘మైఖేల్’ కోసం వర్క్ స్టార్ట్ చేశాం. దర్శకుడు రంజిత్ జయకోడి నాకు యునీవర్స్ ఇచ్చిన గిఫ్ట్. తను అద్భుతమైన ఫిల్మ్ మేకర్. అప్పుడప్పుడు నాకు కొంతమంది అసాదరణమైన ఫిల్మ్ మేకర్స్ తో పని చేసే అవకాశం దొరుకుతుంది. ఉదాహరణకు  లోకేష్ కనకరాజ్. ఈ సినిమాని తమిళ్ ప్రజంట్ చేసేది తనే. ఆయన తర్వాత నేను బలంగా నమ్మింది రంజిత్ జయకోడి. అందరూ మొదటి సినిమాలా పని చేయాలనీ అంటారు. కానీ రంజిత్ మాత్రం ఇదే మన ఆఖరి చిత్రం అయితే ఎలా పని చేస్తామో అలా చేయాలి అంట గొప్ప జ్ఞాపకంగా మిగిలే సినిమాలా చేయాలనీ అంటారు. ఈ సినిమా కోసం 24 కిలోల బరువు తగ్గాను. షూటింగ్ లో హీరో కంటే ఎక్కువ రిస్కులు చేసే దర్శకుడు రంజిత్. రామ్ మోహన్ గారు, సునీల్ గారు, భరత్ గారు  అనుకున్న బడ్జెట్ పెరుగుతున్నా ఎక్కడా రాజీ పడకుండా సినిమాని భారీగా నిర్మించారు. టీజర్ చూసి ప్రేక్షకులు చాలా మంచి సినిమా తీసామనే ధైర్యాన్ని ఇచ్చారు. విజయ్ సేతుపతి అన్నతో పని చేయడం గ్రేట్ ఫీలింగ్. తొమ్మిది రోజులు రాత్రిపగలు ఆయనతో షూటింగ్ చేశాం. ఒక్క క్షణం కూడా అలసట చెందలేదు. పైగా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. గౌతం మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్ వరుణ్ సందేశ్, అనసూయ ఇలా చాల మంచి నటీనటులు ఇందులో భాగమయ్యారు. ధనుష్ అన్న, నాని, దుల్కర్, రక్షిత్ శెట్టి, రాజ్ కుమార్ రావ్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్, రాజ్ & డీకే టీజర్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకుల నెంబర్ వన్ ప్రేక్షకులు గా వున్నారని నెంబర్స్ చెబుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే సమయం ఇది. మైఖేల్ లో ఒక కొత్త ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను'' అన్నారు .
 
దివ్యాంశ కౌశిక్ మాట్లాడుతూ.. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాం. సందీప్ కిషన్, భరత్ గారు, రామ్ మోహన్ గారికి కృతజ్ఞతలు. టీజర్ లో కనిపించింది కేవలం పది శాతమే. ఇంకా క్రేజీ మ్యాడ్ నెస్ థియేటర్లో వుంటుంది. తప్పకుండా ఈ సినిమాని అందరూ థియేటర్లో చూడాలి'' అని కోరారు.
 
పుష్కర్ రామ్ మోహన్ రావు మాట్లాడుతూ.. మైఖేల్ చాలా బిగ్గెస్ట్ ప్రొడక్షన్. ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా వున్నాం. సందీప్ కిషన్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. దర్శకుడు అద్భుతంగా తీశారు. టీజర్ చూస్తే మీకు అర్ధమౌతుంది. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మైఖేల్ బలమైన కంటెంట్ వున్న సినిమా. ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది'' అన్నారు.
 
భరత్ చౌదరి మాట్లాడుతూ.. సునీల్ గారు, రామ్ మోహన్ రావు గారితో కలసి ఈ సినిమాతో జర్నీ మొదలుపెట్టడం అనందంగా వుంది. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ ..ఇలా అందరితో కలిసి పని చేయడం మంచి అనుభవం. బేసిగ్గా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్ళే క్రమంలో కొంత టెన్షన్ వుంటుంది. మైఖేల్ విషయంలో మాత్రం ఎలాంటి టెన్షన్ లేదు. అవుట్ పుట్ పట్ల చాలా హ్యాపీగా వున్నాం. మంచి కథతో, అద్భుతమైన నిర్మాణ విలువలతో తీసిన ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది'' అన్నారు.
 
దర్శకుడు రంజిత్ జయకోడి మాట్లాడుతూ.. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు'' తెలిపారు. డైలాగు రైటర్ కళ్యాణ్ చక్రవర్తి, డీవోపీ కిరణ్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి, రవితేజ కాంబినేష‌న్‌లో మెగా154 టైటిల్ టీజర్ రాబోతుంది