Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాకైతే చాలా నచ్చేసింది - రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ విడుదలలో ర‌వితేజ‌

Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri, Divyansha Kaushik
, శనివారం, 16 జులై 2022 (22:10 IST)
Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri, Divyansha Kaushik
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. హైదరాబద్ లో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అభిమానుల కోలాహం మధ్య బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి 'రామారావు ఆన్ డ్యూటీ'  ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ వేడుకలో రవితేజ, నిర్మాత సుధాకర్ చెరుకూరి, దర్శకుడు శరత్ మండవ, దివ్యాంశ కౌశిక్, నాజర్, సుదీర్ వర్మ, త్రినాథ రావ్ నక్కిన , వంశీ, కళ్యాణ్ చక్రవర్తి, సాహి సురేష్  తదితరులు పాల్గొన్నారు.  

ట్రైలర్ ఎలా వుందంటే!
''ఇన్నాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చట్టప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను..ఇక పై రామారావు గా ధర్మం కోసం డ్యూటీ చేస్తాను'' అని మాస్ మహారాజా రవితేజ చెప్పిన డైలాగ్ తో మొదలై ట్రైలర్.. ఆద్యంతం యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బ్రిలియంట్ గా సాగింది. ట్రైలర్ బిగినింగ్ లో ఒక ఆపరేషన్ లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు మాయమయ్యారని చెప్పడం.. ''మా నాన్నని వెదకడానికి హెల్ప్ చేస్తారా ?'' అని ఓ పాప ప్రదేయపడగా...  రామారావు గా రవితేజ ఎంట్రీ మెస్మరైజింగా  అనిపించింది. ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ లు, రవితేజ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి.
 
ముఖ్యంగా కథపై ట్రైలర్ చాలా క్యూరియాసిటీని పెంచేసింది. ఒక ప్రాంతంలోని వ్యక్తులు ఎందుకు మిస్ అవుతున్నారు?  ఆ ఆపరేషన్ వెనుక ఉన్నదెవరు?  ఈ మిస్టరీని రామారావు ఎలా చేధిస్తాడనేది ట్రైలర్ లో చాలా గ్రిప్పింగా చూపించారు. ''కనిపించకుండాపోయింది ఒక్కరో  ఇద్దరో కాదు'' అని రామారావు చెప్పడం మరింత థ్రిల్, సస్పెన్స్ ని యాడ్ చేసింది. ట్రైలర్‌లో సినిమాకు సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ ని చాలా ఇంట్రెస్టింగా ప్రజంట్ చేశారు. బలమైన కథ, కథనం, పాత్రలు,ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఆసక్తికరంగా ఉనాయి.  రవితేజ నిజాయితీ ధైర్యంగల గవర్నమెంట్ ఆఫీసర్‌గా, ఫ్యామిలీ మ్యాన్‌గా, రొమాంటిక్ గాయ్ గా, గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషిగా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అన్ని కోణాల్లో ఒదిగిపోయారు.  పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన వేణు తొట్టెంపూడి పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.
 
దర్శకుడు శరత్ మండవ తన తొలిచిత్రంలోనే  తనకంటూ ఒక ప్రత్యేక ముద్రవేసుకున్నాడు.  నిజానికి ఈ కథ 1995లో నాటిది.  ఒక చాలెంజింగ్ సబ్జెక్ట్‌ని చాలా కన్విన్సింగ్‌గా డీల్ చేశాడని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.  
 
webdunia
Rama Rao On Duty Trailer function
రవితేజ మాట్లాడుతూ.. దర్శకుడు శరత్ అద్భుతమైన సినిమా తీశారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చింది కదా.. నాకైతే చాలా నచ్చేసింది. సత్యన్ సూర్యన్, సామ్ సిఎస్ మిగతా టెక్నిషియన్లు అద్భుతంగా పని చేశారు. దివ్యాంశ కౌశిక్‌ అందంగా వుంది. ట్రైలర్ ఈవెంట్ కి వచ్చిన అనిల్ రావిపూడి మిగతా గెస్ట్ లకు థాంక్స్. మరిన్ని విషయాలు ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుకుందాం'' అన్నారు
 
దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో రవితేజ గారు వుండటం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నా. నాలాంటి వారిని చాలా మందిని ఆయన పరిచయం చేశారు. కొత్త ఆలోచనలు వినడానికి ఎప్పుడూ సిద్దంగా వుంటారు. నా టీం అందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం ఆనందంగా వుంది. 29 న అందరూ థియేటర్ కి రండి. 'రామారావు ఆన్ డ్యూటీ' మిమ్మల్ని అన్ని రకాలుగా అలరిస్తుంది'' అన్నారు.
 
నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. ట్రైలర్ ఈవెంట్ కి వచ్చిన అభిమానులకు, అతిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
 
అనిల్ రావిపూడి మాట్లాడుతూ..రవితేజ మాస్ మహారాజా మాత్రమే కాదు మంచి మనసున్న మహారాజా. చాలా దర్శకులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్ దర్శకులని చేశారు.  'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్, సాంగ్స్ అన్నీ అద్భుతంగా వున్నాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఎక్స్ టార్డినరీగా వుంది.  దర్శకుడు శరత్ అద్భుతంగా తీశారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. నిర్మాతలకు, నటీనటులకు  అందరికీ ఆల్ ది బెస్ట్. 'రామారావు ఆన్ డ్యూటీ' 29 న వస్తోంది. ఆ రోజు మీరు కూడా ఆన్ డ్యూటీ''అన్నారు.
 
సుధీర్ వర్మ మాట్లాడుతూ.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో భాగం కావడం ఆనందంగా వుంది. రవితేజ, సుధాకర్ చెరుకూరి, శరత్ మిగతా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ 'రామారావు ఆన్ డ్యూటీ''' అన్నారు
 
వంశీ మాట్లాడుతూ..రవితేజ గారు హార్డ్ వర్క్ ని నమ్మే మనిషి. ఆయనే మాకు గొప్ప ప్రేరణ.  'రామారావు ఆన్ డ్యూటీ'' ట్రైలర్ అద్భుతంగా వుంది. సినిమా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది'' అన్నారు.
 
త్రినాథ రావ్ నక్కిన మాట్లాడుతూ.. ఈమధ్య ఏ ఆఫీస్ కి వెళ్ళిన పప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదని చెబుతున్నారు. కంటెంట్ వుండాలని చెబుతున్నారు కంటెంట్ కటౌట్ పెడితే అది రవితేజ.  29న థియేటర్ కి వెళ్ళే చూడాలి. నేను రవితేజ గారికి పెద్ద అభిమానిని. ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. 29న అందరూ థియేటర్ వెళ్ళే సినిమా చూడండి'' అన్నారు
 
దివ్యాంశ కౌశిక్ మాట్లాడుతూ.. 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంలో భాగం కావడం ఆనందంగా వుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. 29 న థియేటర్ కి వస్తోంది. మీరంతా థియేటర్ లో చూడాలి'' అని కోరారు  
 
నాజర్ మాట్లాడుతూ.. మీ కోసం ఒక అద్భుతమైన చిత్రం తీశాం. రవితేజ గొప్ప వ్యక్తి. ఆయన చుట్టుపక్కల వున్న అందరినీ సంతోషంగా వుంచుతారు. ఈ చిత్రంలో మీ అందరికీ ఆనందాన్ని ఇస్తారు'' అన్నారు.
 
తారాగణం: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
 
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్
సంగీతం: సామ్ సిఎస్
డివోపీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పీఆర్వో: వంశీ-శేఖర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగా - మాస్ కాంబినేషన్ - మెగా 154లో రవితేజ?