Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫస్ట్ డే ఫస్ట్ షో' టీజర్‌ లాంచ్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్

Trivikram Srinivas, Edida Sreeja, and others
, సోమవారం, 11 జులై 2022 (16:44 IST)
Trivikram Srinivas, Edida Sreeja, and others
ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న చిత్రం`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి సంయక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేసి మేకర్స్‌కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. టీజర్‌ ఆసక్తికరంగా వుందని ప్రసంశించిన ఆయన, ప్రాజెక్ట్‌ కు కలిసి పనిచేసిన యంగ్ టీమ్ ని అభినందించారు.
 
2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా విడుదల గురించి ఒక హిందీ వాయిస్ ఓవర్ లో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 2001లో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా విడుదలైన సమయంలో జరిగిన కథగా ఈ సినిమా వుండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. తన గర్ల్ ఫ్రెండ్ ని ఆకట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఖుషి సినిమా 'ఫస్ట్ డే ఫస్ట్ షో' టిక్కెట్లని సంపాదించే క్రమంలో హీరో పడిన ఇబ్బందులు చుట్టూ ఈ కథ వుండబోతుంది. భిమానుల హంగామా, ఆ సమయంలో థియేటర్ల వద్ద వాతావరణం టీజర్ లోచక్కగా చూపించారు.
 
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, మహేష్, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను వంటి ప్రముఖ నటీనటులు వున్నారు. ఈ చిత్రం హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోదని టీజర్ చూస్తే అర్దమౌతుంది.
 
శ్రీకాంత్ రెడ్డి తన తొలి పరిచయంతోనే ఆకట్టుకున్నాడు. సంచితా బాసు అందంగా కనిపించింది. టీజర్ కి రాధన్ ఇచ్చిన నేపధ్య సంగీతం క్యాచిగా వుంది. టీజర్ లో విజువల్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.  
 
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగల్ "మజ్జా మజ్జా" స్మాష్ హిట్ గా సాధించి, యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ తో రిజిల్, జోష్ , చింగారి వంటి షార్ట్ వీడియో యాప్స్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది.
 
ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, ఎడిటర్ గా మాధవ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
 
తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాసు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా
 
సాంకేతిక విభాగం
సమర్పణ: ఏడిద శ్రీరామ్
కథ: అనుదీప్ కెవి
నిర్మాత: శ్రీజ ఏడిద
దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పి
స్క్రీన్ ప్లే: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్, కళ్యాణ్
డైలాగ్స్: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్
సంగీతం: రాధన్
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటర్: మాధవ్
పీఆర్వో : వంశీ-శేఖర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీజ మూడో పెళ్లి.. పూజిత సంచలన వ్యాఖ్యలు.. అడ్జస్ట్ కాకపోవడమే?