Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'యుద్ధం శరణం'... నాగచైతన్యతో లావణ్య త్రిపాఠీయా? విలన్ శ్రీకాంతా? రివ్యూ(Video)

యుద్ధం శరణం నటీనటులు: నాగచైతన్య, లావణ్య త్రిపాఠీ, రేవతి, రావు రమేష్ తదితరులు. సంగీతం: వివేక్, కథ: డేవిడ్ ఆర్.నాథన్, నిర్మాత: రజనీ కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్. వి. మారిముత్తు. నాగచైతన్య, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ అనగానే ఏదో వెరైటీ చేస్తారనుకున్న

'యుద్ధం శరణం'... నాగచైతన్యతో లావణ్య త్రిపాఠీయా? విలన్ శ్రీకాంతా? రివ్యూ(Video)
, శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (20:08 IST)
యుద్ధం శరణం నటీనటులు: నాగచైతన్య, లావణ్య త్రిపాఠీ, రేవతి, రావు రమేష్ తదితరులు. సంగీతం: వివేక్, కథ: డేవిడ్ ఆర్.నాథన్, నిర్మాత: రజనీ కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్. వి. మారిముత్తు.
 
నాగచైతన్య, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ అనగానే ఏదో వెరైటీ చేస్తారనుకున్నారు. శ్రీకాంత్ విలన్ అనగానే మరికాస్త ఆసక్తి కలిగింది. మరి వీరి కాంబినేషన్లో వచ్చిన యుద్ధం శరణం ఎలా వుందయా అంటే.... మంత్రి పదవిలో వున్న వినోద్ కుమార్ ఓ స్కాంలో ఇరుక్కుంటాడు. దీంతో అతడి పొలిటికల్ లైఫ్ డైలమాలో పడిపోతుంది. దీంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు సిటీలో బాంబ్ బ్లాస్టులకు కుట్ర చేస్తాడు మంత్రి. ఈ పనిని కరడుగట్టిన నాయక్(శ్రీకాంత్)కు అప్పగిస్తాడు. 
 
మంత్రి ప్లాన్ చేసినట్లే నాయక్ పక్కాగా పేలుళ్లకు పాల్పడతాడు. ఈ పేలుళ్లలో చాలామంది ప్రాణాలు కోల్పోతారు. పేలుళ్లు జరిగిన మూడు రోజుల తర్వాత హీరో అర్జున్(నాగచైతన్య) తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. వారు ఓ ప్రమాదంలో చనిపోయారని తెలుస్తుంది. ఐతే అది యాక్సిడెంట్ కాదనీ, నాయక్ వారిని చంపాడని తెలుసుకుంటాడు అర్జున్. నిజం తెలుసుకున్న హీరో ఏం చేశాడన్నది మిగిలిన స్టోరీ... వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరా కత్తి మహేష్? పవన్ గురించి తెలిస్తే నోరు మూస్కుంటారు... రేణూ ఫైర్