లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల సోలోగా సినిమాలు చేసిన పెద్దగా ఫలితం కనిపించలేదు. నువ్వు తోపురా, కుందనపుబొమ్మ, రాజా విక్రమార్క వంటి సినిమాలు చేస్తూ కష్టపడుతున్నాడు. క్రాక్ సినిమాలో పోలీస్ గా చిన్న పాత్ర చేసాడు. కానీ హీరోగా చేయాలనీ ట్రై చేస్తూ తాజాగా నారాయణ & కో చేసాడు. ఈరోజే విడుదల అయింది. సుధాకర్ కోమాకుల, ఆమని, దేవి ప్రసాద్, ఆరతి పొడి, యామిని బి, పూజా కిరణ్ ప్రధాన పాత్రల్లో నారాయణ & కో అనే చిన్న బడ్జెట్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన పాపిశెట్టి దర్శకత్వం వహించారు. అది ఎలా ఉందో చూద్దాం.
కథ:
మధ్యతరగతి కుటుంబానికి చెందిన నారాయణ (దర్శకుడు దేవి ప్రసాద్) మీ బ్యాంకు లో క్యాషియర్. అతనికి ఇద్దరు కొడుకులు ఆనంద్ (సుధాకర్), సుభాష్ (జై కృష్ణ). ఆనంద్ క్రికెట్ బెట్టింగ్‌లో లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటాడు, మరోవైపు ఒక బ్లాక్‌మెయిలర్ సుభాష్‌కి చెందిన ప్రైవేట్ వీడియో తన వద్ద ఉందని చెప్పి 10 లక్షలు డిమాండ్ చేస్థాడు. నారాయణ తన పనిలో ఒక పొరపాటు చేస్తాడు, దాన్ని వాళ్ళ బ్యాంకు కు 25 లక్షలు చెల్లించవలసి వస్తుంది. మరో మార్గం లేకపోవడంతో, నారాయణ తన కుటుంబంతో కలిసి ఓ మాఫియాతో డీల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత ఏం జరుగుతుందనేది కథలో కీలకాంశం.
ప్లస్ పాయింట్లు:
మొదటి సగం కథాంశంలో పెద్దగా ఏమీ జరగనప్పటికీ, వినోదం సినిమాని కదిలిస్తుంది. కొన్ని హాస్య సన్నివేశాలు చక్కగా ఉన్నాయి, మొదటి సగం చూడదగినవిగా ఉన్నాయి. కొన్ని సమయాల్లో హాస్యం కోసం ఇప్పటికీ భరించదగినది. పాత్రల ఏర్పాటును చక్కగా చేశారు.
అనుభవజ్ఞులైన నటులు దేవి ప్రసాద్, ఆమని ఆకట్టుకున్నారు. వారి చేష్టలు అక్కడక్కడ నవ్వులు పూయించాయి. కథానాయకుడు సుధాకర్ తన పాత్రలో ఈజ్ చూపాడు. అతను తన నటనపై సిన్సియర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొత్తవాడైన జై కృష్ణ తన వన్-లైనర్స్‌తో సుధాకర్‌కి మంచి మద్దతునిచ్చాడు. పూజా కిరణ్ టాంబోయిష్ పాత్ర బాగుంది. శివకుమార్ రామచంద్రవరపు, యామిని తమ తమ పాత్రల్లో పర్వాలేదు. మెలోడీ సాంగ్ వినసొంపుగా ఉంది. కానీ. సెకండ్ ఆఫ్ లో ఫామిలీ సాంగ్ ఎబ్బెట్టుగా ఉంది.
మైనస్ పాయింట్లు:
ఈసినిమా గురుంచి ముందే.. హింట్ ఇచ్చినట్లు.. తిక్కల్ ఫామిలీ.. సందడి అని చెప్పారు. ఇక ఈ కథ చూస్తే అల్లరి నరేష్ చేసిన బ్లేడ్ బాబ్జీకి పోలికను కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లోని ఫన్ ఎలిమెంట్ సెకండ్ హాఫ్‌లో కొనసాగలేదు. చాలా బోరింగ్‌గా మారాయి. సప్తగిరి సో సో గా ఉంది. దేవీప్రసాద్, తోటకూర రఘు వంటి నటీనటుల ప్లేస్‌మెంట్ బాగోలేదు. సెకండాఫ్‌లో పేసింగ్ కాస్త స్లో అవుతుంది. ఆమని పాత్ర కూడా ఓవర్ గా ఉంది. కథలో అసలు పాయింట్ పిల్లి బొమ్మ. దానిలో వజ్రాలు ఉంటాయని ప్రేక్షకుడు అనుకోవాలి. క్లైమాక్స్ చాలా బాడ్ గాఉంది. కొన్ని సన్నివేశాల్లో లింక్ కుదరదు. ఇదంతా దర్శకుడు తప్పిదమే. చాలా లోపాలున్నా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సినిమాతో నిర్మాతగా తనకు చాలా అనుభవం వచ్చిందని సుధాకర్ తెలియజేశాడు. ఈసారైనా సక్సెస్ కొట్టాలని ఆశిద్దాం.