Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాయిపల్లవికి 'ఫిదా'... రివ్యూ రిపోర్ట్

ఫిదా తారాగణం: వరుణ్ తేజ్, సాయిపల్లవి, రాజా చెంబోలు, సాయిచంద్, శరణ్య తదితరులు, సంగీతం: శక్తికాంత్, నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్. రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల. మనకు తెలుసు శేఖర్ కమ్ముల అనగానే ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు. అదేనండీ సినీ లోకం ద్వారా. ఎంతో సహ

Advertiesment
సాయిపల్లవికి 'ఫిదా'... రివ్యూ రిపోర్ట్
, శుక్రవారం, 21 జులై 2017 (21:47 IST)
ఫిదా తారాగణం: వరుణ్ తేజ్, సాయిపల్లవి, రాజా చెంబోలు, సాయిచంద్, శరణ్య తదితరులు, సంగీతం: శక్తికాంత్, నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్. రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల.
 
మనకు తెలుసు శేఖర్ కమ్ముల అనగానే ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు. అదేనండీ సినీ లోకం ద్వారా. ఎంతో సహజంగా చిత్రాలను రూపొందిస్తాడన్న పేరు ఆయనకు వుంది. ఐతే ఆమధ్య తీసిన చిత్రాలు కాస్త పరాజయాలు చవిచూసినా ఇప్పుడు ఫిదా అంటూ వరుణ్ తేజ్, సాయిపల్లవిలతో ముందుకొచ్చాడు. ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ:
వరుణ్(వరుణ్ తేజ్) అమెరికాలో వైద్యుడు. తన అన్నయ్యతో అక్కడ కలిసి వుంటాడు. అన్నకు ఇండియా సంబంధం రావడంతో పిల్లను చూసేందుకు అన్నయ్య తన తమ్ముడిని కూడా తీసుకొస్తాడు. తన ఓపీనియన్ కోసం రమ్మంటాడు. ఐతే వచ్చీ రావడంతోనే పెళ్లి కూతురు చెల్లెలు భానుమతి(సాయిపల్లవి)తో గొడవ పెట్టుకుంటాడు. పెళ్లి జరిగితే తన అక్క తమ ఊరు వదిలి వెళ్లిపోతుందనీ, మన పల్లెల్ని వదిలి వెళ్లకూడదన్నది ఆమె అభిప్రాయం. 
 
ఐతే వరుణ్ మాత్రం ఇక్కడ ఏముంది... చెత్త చెదారం అనే ధోరణిలో వుంటాడు. అక్కడే ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ కోపంతో వరుణ్‌ను ఇబ్బందులు పెట్టి సంతోషిస్తుంటుంది. మొత్తమ్మీద తన అన్నయ్యకు భానుమతి అక్కతో పెళ్లి జరిగిపోతుంది. ఈ క్రమంలో వరుణ్ చాలా మంచివాడేనని భాను తెలుసుకుంటుంది. కానీ ఓ విషయం దగ్గర ఇద్దరిమధ్య మనస్పర్థ తలెత్తుతుంది. దీంతో వరుణ్ తన అన్నయ్య-వొదినలతో కలిసి అమెరికా వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది స్టోరీ.
 
సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకూ తెలంగాణ యాసను వదిలేస్తే మనకు ఆనంద్ సినిమా గుర్తుకు వస్తుంది. ఐతే సినిమాలో కొన్ని సంభాషణలు బాగున్నాయి. ముఖ్యంగా తెలుగు రాని అమ్మాయి సాయిపల్లవితో తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పించడం ఆసక్తికరం. సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ చూస్తే నూటికి నూరు మార్కులు వేయవచ్చు. ఇక వరుణ్ తేజ్ ఆమె యాక్షన్‌తో పోల్చుకున్నప్పుడు కాస్త తక్కువనే చెప్పాలి.
 
ఇక శేఖర్ కమ్ముల గురించి చెప్పాలంటే 13 ఏళ్ల క్రితం తీసిన ఆనంద్ చిత్రం తరహాలోనే లాగించేశాడు. రెండున్నర గంటల సినిమాలో చూసిన సీన్లనే మళ్లీమళ్లీ చూస్తున్నామా అనిపిస్తుంది. తండ్రీకూతుళ్ల మధ్య సెంటిమెంట్ సీన్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లు. బలమైన కథ లేకపోవడమే ఈ చిత్రానికి మైనస్ అని చెప్పవచ్చు. మొత్తంగా చెప్పాలంటే కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమాగా చెప్పుకోవచ్చు. సాయిపల్లవి నటనకు ఫిదా అయిపోవాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుట్టు విప్పుతున్న సుబ్బరాజు... 15 మంది అగ్ర నటీనటులు డ్రగ్ ఎడిక్ట్స్... ఓ సినీ ఫ్యామిలీ...