గుట్టు విప్పుతున్న సుబ్బరాజు... 15 మంది అగ్ర నటీనటులు డ్రగ్ ఎడిక్ట్స్... ఓ సినీ ఫ్యామిలీ...
నటుడు సుబ్బరాజు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసే విషయాలను చెపుతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వాడుతున్నవారిలో టాప్ హీరో, హీరోయిన్లు వున్నారనీ, తన వద్ద ఆధారాలు కూడా వున్నట్లు సుబ్బరాజు చెప్పినట్లు సమాచారం. అంతేకాదు... దశాబ్దాల కాలంగా సినీ ఇండస్ట్రీతో అను
నటుడు సుబ్బరాజు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసే విషయాలను చెపుతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వాడుతున్నవారిలో టాప్ హీరో, హీరోయిన్లు వున్నారనీ, తన వద్ద ఆధారాలు కూడా వున్నట్లు సుబ్బరాజు చెప్పినట్లు సమాచారం. అంతేకాదు... దశాబ్దాల కాలంగా సినీ ఇండస్ట్రీతో అనుబంధమున్న ఓ ఫ్యామిలీలో ఇద్దరు నటులు డ్రగ్స్ వాడుతున్నారని తెలియజేసినట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీలో వీరే కాకుండా మరో 15 మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పడంతో సిట్ అధికారులు షాక్ తిన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకునే వ్యక్తులు ఈ స్థాయిలో వుండటంపై ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు సుబ్బరాజు చెప్పిన మాటల్లో నిజానిజాలను తెలుసుకునేందుకు సిట్ అధికారులు రంగంలోకి దిగారు.
ఆయా పబ్, బార్ల యాజమాన్యాలను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. మొత్తమ్మీద టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.