Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారసుడు రివ్యూ రిపోర్ట్.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ప్లస్, మైనస్ ఇవే

vaarasudu
, శనివారం, 14 జనవరి 2023 (12:38 IST)
vaarasudu
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన కలిసి నటించిన వారసుడు సినిమా నేడు విడుదలైంది. మహర్షి ఫేమ్ డైరక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ కెరీర్‌లోనే ఇది తొలి డైరక్ట్ సినిమా నిలిచింది. విడుదలైంది కూడా. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 11 తమిళంలో వారిసుగా విడుదలైంది. తెలుగులో ఈ సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. 
 
ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం.. భారత్‌లో అతిపెద్ద బిజినెస్ మ్యాన్‌లలో రాజేంద్రన్ ( శరత్ కుమార్) ఒకరు. ఈయనకు శ్రీకాంత్ (జై), అజయ్  (శ్యామ్)తో పాటు విజయ్ రాజేంద్రన్ (విజయ్) అనే ముగ్గురు కుమారులు వుంటారు. ఈ ముగ్గురిలో విజయ్ ఏడేళ్ల తర్వాత ఇంటికి వస్తాడు. తండ్రితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన అతను.. తండ్రికి పాంక్రియాటిక్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో వుండగా తిరిగి వస్తాడు.  ఇతడికి విజయ్ వారసుడు అయ్యాడా.. శత్రువుల బారి నుంచి తన కుటుంబాన్ని విజయ్ కాపాడాడా అనేది స్టోరీ. 
 
విశ్లేషణ
విజయ్ నటన అదిరింది. సినిమా మొత్తం అంతా తానై నడిపించాడు. తన పాత్రలో పూర్తి స్థాయిలో ఒదిగిపోయి కనిపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. రష్మిక పాత్ర పరిమితమే.  రష్మిక, జయసుధ నటన అదిరింది. శరత్ కుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ప్రకాష్ రాజ్ నటన కూడా బాగుంది. 
 
ప్లస్ పాయింట్స్ 
తమన్ సంగీతం. 
ఫస్ట్ హాఫ్ బాగుంది. 
విజువల్స్ 
ఫ్యామిలిసెంటిమెంట్స్ 
కామెడీ 
 
మైనస్ 
సెకండాఫ్ సాగదీత 
చాలా సన్నివేశాలు తెలుగు సినిమాలతో పోలిక వున్నట్లు కనిపించడం..  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహజ నటి జయసుధ మూడో పెళ్లి.. ఆ బిజినెస్ మ్యాన్‌తో...?