Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరో, దర్శకుడు, నిర్మాత అంతా అతడే... మెప్పించిన 'వానవిల్లు'

పలు షార్ట్‌ ఫిలింస్‌ తీసి సినిమాపై వున్న తపనతో కెమేరాతో పలు ప్రయోగాలు చేస్తున్న లంక ప్రతీక్‌ తానే హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా 'వానవిల్లు'. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ : స్నేహితులకు ఎక్కువ

హీరో, దర్శకుడు, నిర్మాత అంతా అతడే... మెప్పించిన 'వానవిల్లు'
, శుక్రవారం, 8 డిశెంబరు 2017 (19:11 IST)
పలు షార్ట్‌ ఫిలింస్‌ తీసి సినిమాపై వున్న తపనతో కెమేరాతో పలు ప్రయోగాలు చేస్తున్న లంక ప్రతీక్‌ తానే హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా 'వానవిల్లు'. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
 
కథ :
స్నేహితులకు ఎక్కువ విలువ ఇచ్చే ప్రతీక్‌ వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి సాహసిస్తుంటాడు. అలాంటి అతని జీవితంలోకి శ్రావ్య (శ్రావ్య) అనే అమ్మాయి ప్రవేశించి అతన్ని ఒక పెద్ద ఛాలెంజ్‌ ఎదుర్కొనేలా చేస్తుంది. ఆ ఛాలెంజ్‌ ఏంటి? అసలు శ్రావ్య ఎవరు? అనేదే సినిమా.
 
విశ్లేషణ :
సినిమా ఆరంభం తన స్నేహితుడికి అతని ప్రేయసిని కలిపేందుకు హీరో చేసిన పాయింట్‌తో ప్రారంభమవుతుంది. ఇది రామ్‌తో పాటు పలువురు హీరోలు చేసిన కాన్సెప్ట్‌ అయినా కథను నడిపే విధానం కొత్తగా అనిపిస్తుంది. హీరోతో పాటు దర్శకత్వం చేయడం సాహసమనే చెప్పాలి. ఎక్కడా బెణకకుండా కథనాన్ని నడిపాడు. సినిమాపై పూర్తి క్లారిటీ వుంది.

కొత్త హీరోనే అయినా ప్రతీక్‌ నటనా పరంగా మెప్పించాడు. జాలీగా తిరిగే కుర్రాడి పాత్రలో సరిగ్గా ఇమిడిపోయాడు. పాటల్లో అతని డాన్స్‌, కొన్ని ఎలివేషన్‌ సీన్లలో స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగున్నాయి. అతని ఆహార్యం, హావభావాలు, మేనరిజం అంతా తమిళ హీరో విజయ్‌ను పోలివుంది. నాయిక శ్రావ్య కూడా మంచి పాత్ర లభించడంతో నటన కనబర్చింది. నిర్మాత విలువలు కూడా రిచ్‌గా ఉన్నాయి. పెట్టిన ఖర్చు స్క్రీన్‌ మీద కనబడటంతో క్వాలిటీ ఫిల్మ్‌ చూస్తున్న భావన కలిగింది.
 
అయితే మొదటి అర్థ భాగంలో అసలు కథేమిటో అర్థంకాదు. ఇంటర్వెల్‌ వరకు సినిమా చాలా నిదానంగా నడిచింది. సినిమా అసలు కథలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకోవడంతో ఆఖరు 20 నిముషాలు తప్ప ఎక్కడా ఆసక్తి కలుగలేదు. స్టోరీ కొద్దిగా రొటీన్‌‌గానే ఉన్నా బెటర్‌గా చెప్పాలని ప్రయత్నించాడు. దానికితోడు వున్న సీన్లు కూడా కొన్ని మరీ లాజిక్స్‌కు అందకుండా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. హీరోనే కామెడీని పండించడం విశేషం. 
 
కథ చెప్పిన విధానంలో ఆసక్తికరమైన, ఆకట్టుకునే అంశాలేవీ లేకపోయినా కొన్ని ఎలివేషన్‌ సీన్లు, పాటల్ని ఇంప్రెసివ్‌గా చిత్రీకరించారు. అరకు లొకేషనల్లో చేసిన సినిమాటోగ్రఫీ బాగుంది. పాటల సంగీతం, బ్యాక్‌‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదనిపించాయి. లిమిటెడ్‌ బడ్జెట్లోనే తీసినా సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. వానవిల్లు అంటే రెయిన్‌బో.. అది టాటూగా పెట్టుకున్న హీరోయిన్‌ కోసం వెతికే క్రమంలో హీరో పడే పాట్లే కథ. హీరో, దర్శకుడు, నిర్మాత కూడా అన్నీ తానై చేసిన ప్రతీక్‌కు టెస్ట్‌ ట్రైల్‌గా ఈ చిత్రం వుంది.
 
రేటింగ్ ‌: 2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాంకర్ శ్రీముఖి నటిగా అదరగొట్టేసింది... బీటెక్ బాబులు రివ్యూ రిపోర్ట్