Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆకట్టుకోలేని పాన్ ఇండియా బనారస్‌,రివ్యూ రిపోర్ట్

Zaid Khan, Sonal Montero
, శుక్రవారం, 4 నవంబరు 2022 (07:52 IST)
Zaid Khan, Sonal Montero
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్‌' తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు.  'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదలయింది. మరి ఎలా ఉందొ చూద్దాం.
 
కథ
జైద్ ఖాన్ మిలినియర్ కొడుకు. ఓ రోజు స్నేహితులతో పార్టీ చేసుకుని వారితో బెట్ కాసి సోనాల్ మోంటెరో ను పేమిస్తున్నట్లు నమ్మిస్తాడు. అంతే కాక ఆమెతో ఓ ఫోటో  దిగుతాడు. అది  సోషల్ మీడియాలో  వస్తుంది. దాంతో ఆమె చదువు బ్రేక్ పడుతుంది. తన తప్పు ఆలస్యంగా తెలుసుకున్నా  జైద్ ఖాన్  ఆమె కోసం బనారస్‌ వస్తాడు. అక్కడ ఆమెకు క్షమాపణ చెప్పాలని ట్రై చేస్తాడు. చివరకు ఒప్పుకుంటుంది. ఆతర్వాత తాను టైం ట్రావెలో ఉన్నాయని భ్రమపడతాడు జైద్ ఖాన్. ఇక అక్కడనుండి కథ ఏటో వెళ్ళిపోతుంది. 
 
విశ్లేషణ
ఇది టైం ట్రావెల్ కథ అని చెపుతున్నా సినిమా చూసాక అది కాదు అని తెలుస్తుంది. కథలో ఎక్కడ ఆకట్టుకొని అంశం లేదు. జనాలను విసిగిస్తుంది. హీరోయిన్ ను హీరో ఎలా ఓ కథ చెప్పి చేటు చేస్తాడో అదేవిధంగా  హీరోయిన్ బాబును సైన్ టిస్ట్ గా హీరోని చీట్ చేస్తాడు. కేవలం ఈ పాయింట్ తో సినిమా తీయడం సాహసమే అని చెప్పాలి.
 
ఎక్కడా లవ్ ట్రాక్ సరిగా ఉండదు. కేవలం బెనారస్ లో గంగ ఒడ్డున పూజలు, సవా దహనాలు మాత్రమే ఎక్కువగా చూపిస్తాడు.. ఓ దదశలో జీవితంపై విరక్తి కూడా కలుగుతుంది. ఏ సన్నీ వేశాలు ఆకట్టుకోవు.
 
హీరో పరంగా కొత్త అయినా బాగానే చేసాడు. హీరోయిన్ కన్నడ నటి. ఆమె పాత్ర నటనకు ఓకే. సింగర్గా పాటలు పాడు తుంది. అది కూడా అతకలేదు. మొత్తంగా హీరోయిన్ పగను ఈమె బాబాయి హీరోపై ఎలా ఓ టైం వాచ్ ఇట్చి తీర్చుకున్నాడనేది కథ.
 
ఇక సంగీతం, కెమెరా బాగేనే ఉన్నాయి. దర్శకుడు. బాగా తీయలేకపోయాడు. నిర్మాణ విలువలు బాతున్నాయి. కే జి ప్ లాంటి సినిమా తీసినా కన్నడ పరిశ్రమ నుంచి ఓ చెత్త సినిమా తెచ్చింది. హీరోని పాన్ ఇండియా లెవల్ లో పరిచయం చేశామని తృప్తి ఒక్కటే మిగిలినది.
 
రేటింగ్ - 1.5//5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గట్టిగా హగ్ చేసుకో..ఫరియా అబ్దుల్లా