Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''ఆకాశమే హద్దురా'' రివ్యూ రిపోర్ట్-సూర్య నటన అదుర్స్

Advertiesment
Aakaasam Nee Haddhu Ra
, గురువారం, 12 నవంబరు 2020 (19:44 IST)
Aakaasam Nee Haddhu Ra
కరోనాతో సినిమా హాళ్లకు మూతపడింది. దీంత సినిమాలన్నీ ఓటీటీలో విడుదలవుతున్నాయి. తాజాగా ఆకాశమే నీ హద్దురా సినిమా ఓటీటీలో విడుదలైంది. విలక్షణ నటుడు సూర్య తమిళంలో నటించిన సూరారై పోట్రులో తెలుగులో అనువదించి అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేశారు. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు కెప్టెన్‌ జిఆర్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం రివ్యూ రిపోర్ట్ ఎలా వుందంటే?
 
కథలోకి వెళితే..గుంటూరు జిల్లాలోని చుండూరు అనే గ్రామంలో మాస్టారుకొడుకు చంద్రమహేష్‌ (సూర్య). తండ్రి మీద కోపంతో బయటకు వచ్చి ఎయిర్‌ ఫోర్స్‌లో చేరతాడు. తర్వాత తండ్రి మంచం పట్టడంతో చూసేందుకు ఇంటికి బయలు దేరతాడు. విమానం ఎక్కేందుకు ప్రయత్నించే సమయంలో మహేష్‌కు చేదు అనుభవం ఎదురౌతుంది. దీంతో బస్సు, ఇతర మార్గాల ద్వారా ఇంటికి చేరతాడు. అప్పటికే తండ్రి చనిపోయి దహన సంస్కారాలు కూడా పూర్తి అయిపోతాయి. 
 
తండ్రి చివరి చూపుకు నోచుకోకపోవడానికి కారణాలను అన్వేషిస్తూ... తనను విమానం ఎక్కడానికి ఎదుర్కొన్న అడ్డంకుల గురించి ఆలోచిస్తాడు. అప్పుడే ప్రతి సామాన్యుడు విమాన ప్రయాణం చేయగలగాలని భావిస్తున్నాడు. అందులో భాగంగా ఓ విమాన సంస్థను ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతాడు. ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న అడ్డంకులే ఈ సినిమా.
 
సమీక్ష:
సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సూర్య వైవిధ్యమైన నటుడు అని మరోసారి నిరూపించారు. సూర్య అంటే ఏమోషన్‌ పాత్రలే ఎక్కువగా గుర్తొస్తుంటాయి. కానీ దానికి భిన్నంగా ఈ సినిమా సాగుతోంది. విమాన ప్రయాణం అనేది సామాన్యుడికి ఇప్పటికీ ఓ కలే. కానీ దాన్ని సాకారం చేసుకునేందుకు గోపీనాథ్‌ పడిన తపనను సూర్య ద్వారా చక్కగా చూపించారు దర్శకురాలు సుధా కొంగర. 
 
ఇక ఆయన భార్య సుందరి పాత్రలో అపర్ణా బాల మురళి నటన బాగుంది. ఎక్కడా అతి చేయలేదు. భర్తను సపోర్ట్‌ చేసే భార్యగా...ఇచ్చిన పాత్ర మేరకు ఒదిగిపోయారు. జివి సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.. మోహన్‌ బాబుది చాలా చిన్నపాత్ర అయినప్పటికీ.. ప్రేక్షకుల మదిలో గుర్తిండిపోతుంది. పరేశ్‌ రావల్‌.. వేరో విమాన సంస్థ యజమానిగా, సూర్య ఎదుగుదలకు అడ్డుకునే పాత్రలో నటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లూసీఫర్ రీమేక్ కోసం రంగంలోకి దిగిన సీనియర్ రైటర్