Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూత్‌ను ఆలోచింపజేసే 'రఘువరన్‌ బిటెక్‌'

Advertiesment
Raghuvaran B Tech Review
రఘువరన్‌ బిటెక్ నటీనటులు: ధనుష్‌, అమలాపాల్‌, సముద్రఖని, వివేక్‌ తదితరులు; సంగీతం: అనిరుధ్‌, నిర్మాత: స్రవంతి రవికిశోర్‌, దర్శకత్వం: వేల్రాజ్‌.
 
తమిళ సినిమాలు కొన్ని సింపుల్‌గా వుంటూ కథ, కథనాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించేలా చేస్తాయి. లోబడ్జెట్‌ చిత్రం కూడా రిచ్ లుక్ తో వస్తుంది. తమిళంలో స్టార్‌ హీరో ధనుష్‌తో దర్శకుడు వేల్రాజ్‌ కొత్త ప్రయోగం చేశాడు. ఆల్‌రెడీ తమిళంలో విజయవంతమైన చిత్రాన్ని అదే పేరుతో రఘువరన్‌ బిటెక్‌గా అనువదించారు. తెలుగులో స్రవంతి రవికిశోర్‌ రీమేక్‌ చేయాలని చూసి ఆఖరికి డబ్బింగ్‌తో విడుదల చేశారు. కొత్త సంవత్సరం రోజున విడుదలైన తొలి డబ్బింగ్‌ సినిమాగా గురువారంనాడు విడుదలైంది. మరి ఇందులో ఏ అంశాలున్నాయో చూద్దాం.
 
కథ: రఘువరన్‌ (ధనుష్‌) సివిల్‌ ఇంజనీర్‌ పూర్తిచేస్తాడు. చదువుకు తగిన ఉద్యోగం రాలేదని వచ్చిన ఉద్యోగాలన్నీ వదులుకుంటాడు. తమ్ముడు అప్పటికే లక్ష జీతంలో సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం చేయడం, పక్కింటి అమ్మాయి శాలిని(అమలా పాల్‌) కూడా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారంటూ తండ్రి దెప్పిపొడవం రఘువరన్‌ సహించలేకపోతుంటాడు. కాగా, రఘువరన్‌ గురించి తెలిసి ఆయనపై శాలిని మనసు పారేసుకుంటుంది. ఆ తర్వాత ఓ సంఘటనతో రఘువరన్‌ తల్లి చనిపోతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన రఘువరన్‌కు ఓ పెద్దమనిషి తగిన ఉద్యోగం ఇప్పిస్తాడు. 
 
అలా వచ్చిన ఉద్యోగం పేదలకు బిల్డింగ్‌ కట్టే పనిలో కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటాయి. ఆ తర్వాత తను ఏంచేశాడు. అసలు ఉద్యోగం తనకే ఎందుకిచ్చాడనేది సినిమాలో ఆసక్తికరం.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
ధనుష్‌ తెలుగువారికి కొత్తవాడు కాదు. గతంలో పలు చిత్రాలు వచ్చాయి. కానీ అవంతగా పెద్దగా ఆదరించలేదు. కానీ ఈ సినిమాలో పక్కింటి కుర్రాడుగా.. సామాన్యుడి పాత్రలో మెప్పించాడు. ఇప్పటి యూత్‌ చేసే పనులు చేసి ఎట్రాక్ట్‌ చేశాడు. నటనలో షేడ్స్‌ చూపించాడు. కొన్నిచోట్ల తన మామగారైన రజనీకాంత్‌ స్టయిల్‌ను కూడా అనుకరించాడు. శాలినిగా అమలాపాల్‌ పాత్ర దర్శకుడు బాగానే డీల్‌ చేశాడు. ఇక చాలాకాలం తర్వాత వివేక్‌ ఇందులో కన్పిస్తాడు. కాస్త నవ్విస్తాడు కూడా. ఆయనతోపాటు మిగిలిన పాత్రలు బాగానే చేశాయి.
టెక్నికల్‌గా.... 
బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అనిరుధ్‌ బాగా చేశాడు. పాత ట్యూన్స్‌ చేసినా సీన్‌పరంగా డీల్‌ చేశాడు. పాటలపరంగా సాహిత్యం ఫర్వాలేదు అనిపించింది. చిత్రంలో ఆకర్షణ సినిమాటోగ్రఫీ. తనే దర్శకుడు కావడంతో వేల్రాజ్‌ బాగా చూపించాడు. ప్రతి అంశాన్ని చక్కగా వివరించారు. కథకు సరిపడే విధంగా వున్నాయి. స్క్రీన్‌ప్లే బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఎక్కడా బోర్‌ కొట్టకుండా దర్శకుడు జాగ్రత్త తీసుకున్నాడు.
విశ్లేషణ
రఘువరన్‌ అనే విలన్‌ టైటిల్‌ పెట్టి మార్కులు కొట్టేశాడు దర్శకుడు. ప్రతి విషయంలో చాలా కేర్‌ తీసుకున్నాడు. సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ కాదు. సందేశం కూడా వుండేలా చూడటం ఇందులో ప్రత్యేకత. రాసుకున్న కథను డీల్‌ చేసే విధానం బాగుంది. స్లమ్‌ ఏరియా నుంచి వచ్చిన సాధారణ వ్యక్తి బిటెక్‌ చేసి నిజాయితీగా ఎలా వున్నాడనేది అంశం. ప్రతి వ్యక్తి నిజాయితీగా వుండాలనే కాకుండా... సమస్యను ఇప్పటి టెక్నాలజీ ఫేస్‌బుక్‌ ద్వారా ఎలా సాల్వ్‌ చేసుకోవచ్చో చూపించాడు. 
 
ఇటీవల ఫేస్‌బుక్‌ ద్వారా లవ్‌లు, ఫేక్‌ లవ్‌లు హెరాస్‌మెంట్‌లు జరుగుతున్న కథల్ని తీసుకుని తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి. టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందని గగ్గోలు పెడుతున్నారు. కానీ అదే టెక్నాలజీ వుపయోగించి దేశం కోసం ముందుకు వచ్చే యువత కూడా వున్నారని దర్శకుడు నిరూపించారు. రాజకీయంగా పలుకుబడి గల వ్యక్తులు కామన్‌‌మేన్‌ను ఎదగనీయకపోతే ఫేస్‌బుక్‌ ద్వారా ఎలా ఎదిగాడనేది చక్కగా చూపించాడు. ఇటువంటి సినిమా యూత్‌కు ఆదర్శంగా తీసుకుంటే మరిన్ని మంచి పనులు చేయవచ్చని తెలియజెప్పాడు. మొత్తంగా ఈ చిత్రం చక్కటి ప్రయత్నం.

Share this Story:

Follow Webdunia telugu