Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బస్తీ కుర్రాళ్ల జీవితం నేపథ్యంలో ఓసీ చిత్రం- రివ్యూ

OC movie

డీవీ

, శనివారం, 8 జూన్ 2024 (08:16 IST)
OC movie
నటీనటులు: హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి, రాయల్ శ్రీ, లక్ష్మీ కిరణ్ తదితరులు.
సాంకేతికత:  సినిమాటోగ్రఫీ: సాయిరాం తుమ్మలపల్లి, సంగీత దర్శకుడు: భోలే శివాలి, నిర్మాత: బీవీఎస్,  దర్శకత్వం: విష్ణు బొంపెల్లి
 
ఈమధ్య యూత్ సినిమాల పేరుతో ఏదో ఒకవిధమైన సందేశంతోపాటు వారి జీవన విధానాన్ని తెలియజేసేశాల కథలు వస్తున్నాయి. ఈసారి  బీవీస్ నిర్మాతగా, విష్ణు బొంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓసీ. కేవలం డబ్బులు ఉన్నంత మాత్రానా హీరోలు కాలేరు ట్యాలెంట్ ఉంటే ఎవరైనా స్టార్లు కావచ్చు అని ట్రైలర్‌లో, ప్రచార చిత్రాల్లో చూపిస్తూ ప్రేక్షకులను ఆకర్శించారు. శుక్రవారమే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
 
కథ:
 
ఓ బస్తీలో అనాథలైన ముగ్గురు ప్రాణ స్నేహితులు. రాక్ (హరీష్ బొంపెల్లి), మాగ్నైట్ (రాయల్ శ్రీ), కమల్ హాసన్ (లక్ష్మీ కిరణ్). వీరికి నర్సింగ్ అనే వ్యక్తి అండగా ఉంటాడు. చిన్నా చితకపనులు చేసుకునే వీరికి సినిమాల్లోకి వెళ్ళాలనేది గోల్. ఈ క్రమంలో రాక్ కు బాలరాణి (మాన్య సలాడి)తో ఏర్పడిన పరిచయంతో  సినిమా ఆడిషన్స్ వెళతారు. అక్కడ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తనకు మందు ఇప్పిస్తే అవకాశం ఇప్పిస్తా అంటాడు. అందుకు డబ్బులు కావాలి. దానికోసం వీరు బాబూరావ్ అనే గల్లీ రౌడీని బురిడి కొట్టిస్తారు. ఆ తర్వాత వీరికి కష్టాలు ఏర్పడతాయి. దానితోపాటు తమకు అండగా వున్న నర్సింగ్ హత్యకు గురవుతాడు. దాంతో భయంతో పారిపోతారు ఈ ముగ్గురు. ఆ తర్వాత ఏమి జరిగింది? ఈ ముగ్గురూ తమ గోల్ రీచ్ అయ్యారా? లేదా వారి కెరీర్ మరోవైపు మలుపుతిరిగిందా? అనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
 
సినిమారంగం నేపథ్యంలో రవితేజతోపాటు పలువురు చేసిన సినిమాలు వచ్చాయి. అయితే కోడైరెక్టర్ బిహేవియర్ ఎలా వుంటుందనేది ఇందులో నాచురల్ గా చూపించాడు. అసలు ఈ కథకు స్పూర్తిగా మెగాస్టార్ చిరంజీవి తీసుకుని దర్శకుడు రాసుకున్నాడు. ఈ ముగ్గురి కష్టాలను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం జరిగింది. మొదటి భాగం చాలా సరదాగా సాగేలా ప్లాాన్ చేశాడు. అందుకు మధ్యలో రొమాన్స్ సీన్స్ కూడా జోడించాడు. మొత్తంగా సగటు యూత్ ఆలోచనలను ప్రతిబింబించేలా చేశాడు దర్శకుడు.
 
కథకు తగినట్లు అన్ని అంశాలు వున్న ఈ సినిమాలో యాక్షన్ కూడా సన్నివేశపరంగా వుంది. స్నేహితుల మధ్య సమన్వయం ఎలా వుండదలో తెలియజేశాడు. అయితే కొన్ని చోట్ల సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాయి. దానిపై తగిన శ్రద్ధ పెడితే బాగుండేది. సినిమా కష్టాలు చూపించడం ఓకే. కానీ అక్కడక్క కాస్త ఎడిటింగ్ షార్ప్‌గా కట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. 
 
ఇక సెకండ్ ఆఫ్ లో  క్లైమాక్స్ చాలా భావోధ్వేగానికి గురిచేస్తుంది. ఇందులో హీరోగా నటించిన హరీష్ బొంబెల్లికొత్తవాడైనా నటనాపరంగా మెప్పించారు. కొన్ని సీన్స్‌ లో పరిణిత కనిపించింది. ఇక ఫ్రెండ్స్ గా నటించిన రాయల్ శ్రీ, లక్ష్మీ కిరణ్ కూడా పాత్రలలో మెప్పించారు. హీరోయిన్ మాన్య సలాడి, జీవన్ తదితరులు వారి పాత్రలు మేరకు బాగా టించారు. 
 
ఇక దర్శకుడిగా విష్ణు బొంబెల్లి చాలాచోట్ల సీనియర్ లా నేత్రుత్వం వహించారనే చెప్పాలి. కొన్ని చోట్ల ఫర్ఫెక్ట్ టేకింగ్ తో పాటు  ఎమోషన్స్ పండించేలా చేశారు. మరింతగా సినిమారంగంలో రాణిస్తారనే చెప్పాలి. సినిమాటోగ్రాఫర్ సాయిరాం తుమ్మలపల్లి కెమెరా పనితనం,   చైతన్య కొల్లీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్  చాలా ప్లస్ అయ్యారు. నిర్మాణపరంగా కథకు అనుగుణంగా ఖర్చు కనిపిస్తుంది.
 
దర్శకుడు తాను చెప్పాలనుకున్న కథను తన శైలిలో కథనంలో చెప్పే ప్రయత్నం చేయగలిగాడు. సంగీతపరంగా బాగుంది. సినిమా నేపథ్యం కనుక ఇది సినిమా కష్టాలతోపాటు కామన్ యూత్ ఆలోచనలకు ప్రతిబింబంగా వుంది. దీనిని మరింత లోతుగా కాకుండా లైటర్ వేలో టచ్ చేశాడు. కొన్నిచోట్ల సాగదీత మినహా పర్వాలేదనిపించేలా వుంది.
  రేటింగ్: 2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామోజీ నూటికో కోటికో ఒకరు... యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంతాపం