"శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం.
"నిన్ను చూడాలని" చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.
రామోజీరావు మృతిపై సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ సంతాపం వ్యక్తం చేశారు. కాగా 1936 నవంబర్ 16న ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. 1974 ఆగస్టు 10న విశాఖ తీరంలో ఈనాడు దినపత్రికను ప్రారంభించారు.