Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిట్-2 మూవీ టార్గెట్ ఎవరిపై తెలుసా?, రివ్యూ

adavi sesh
, శుక్రవారం, 2 డిశెంబరు 2022 (13:43 IST)
adavi sesh
నటీనటులు: అడివి శేష్-మీనాక్షి చౌదరి-రావు రమేష్-సుహాస్-హర్షవర్ధన్-కోమలి ప్రసాద్-తనికెళ్ల భరణి తదితరులు
సాంకేతికత:  ఛాయాగ్రహణం: మణికందన్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ-సురేష్ బొబ్బలి, నేపథ్య సంగీతం: జాన్ స్టీవర్ట్ ఏడూరి, నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని,  రచన-దర్శకత్వం: శైలేష్ కొలను
 
సిఐడి. తరహాలో నేరపరిశోధన చేసే టీమ్‌ కథతో తొలిసారిగా హిట్‌ సినిమా వచ్చింది. విశ్వక్‌ సేన్‌ నటించాడు. శైలేష్‌ కొలను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు హిట్‌2కూ అతనే దర్శకుడు. కానీ హీరోగా మేజర్‌ ఫేమ్‌ అడవిశేష్‌ను ఎంచుకున్నాడు. నిర్మాత హీరో నాని. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌లో జుగుప్సాకరమైన హత్యలు చూపించాడు. మరి ఈ సినిమా ఈరోజే విడుదలైంది. ఎలా వుందో చూద్దాం.
 
కథ:
కృష్ణదేవ్‌ ఉరఫ్‌ కేడి (అడవిశేష్‌) వైజాగ్‌లో హోమిసైడ్‌ ఇంటర్వెషన్‌ టీమ్‌ (హెచ్‌.ఐ.టి.)లో పనిచేసే ఎస్‌.పి. అధికారి. బీచ్‌ ఒడ్డున మర్డర్‌ అయిన ఓ వ్యక్తిని శోధించేందుకు వస్తాడు. కేడి.కి దూకుడు ఎక్కువ. క్రిమినల్స్‌ను తేలిగ్గా అంచనావేస్తాడు. అందుకే కోడిబుర్రలాంటివాళ్ళని పేరు పెడతాడు. చనిపోయిన వ్యక్తిని అతని అన్నయ్య చంపాడని  తేల్చేసి కాలర్ ఎగరేస్తాడు.. అంత షార్ప్‌గా వున్న కె.డి.కి ఓ అమ్మాయి హత్య అతని తెలివితేటలకు సవాల్‌గా నిలుస్తుంది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తుండగా ఒక్కోక్కరు హత్యకు గురవుతారు. చనిపోయిన అమ్మాయిని కిల్లర్‌ కాలు, చేతులు, మొండెం ఇలా ఒక్కో భాగం నరికేస్తుంటాడు. ఓసారి కెడి. భార్యను కిల్లర్‌ కిడ్నాప్‌ చేస్తాడు. ఆ తర్వాత కెడి.ఓ చిన్న పొరపాటుతో ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత తను ఏం చేశాడు? అన్నది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ
ఇలాంటి క్రైం, థ్రిల్లర్‌ సినిమాలకు ఆయువు పట్టు కథతోపాటు నేరపరిశోధన చేసే విధానం ఊహకందనివిధంగా వుండాలి. కిల్లర్‌ ను చూడగానే షాక్‌ అవ్వాలి. కానీ ఈ రెండు ఇందులో లోపాలుగా కనిపిస్తాయి. అందులోనూ కేవలం అమ్మాయిలనే వరుస హత్యలు చేసే కిల్లర్‌ ఎందుకు చేస్తున్నాడనే పాయింట్‌లో బలం లేదు. చిన్నప్పుడు తన నాన్న చావుకు కారణమైన తన అమ్మమీద కసితో ఈ హత్యలన్నీ చేస్తుంటాడు. కిల్లర్‌ అమ్మ మహిళాసంఘం సభ్యురాలు. ఆ సంఘానికి అధ్యక్షులుగా పనిచేస్తున్న అందరినీ టార్గెట్‌ చేస్తుంటాడు. ఇదే ఈ సినిమాలో ప్రధానమైన మేనస్‌. అసలు కథ రాసుకున్నప్పుడు మహిళా సంఘాలుపై రాసుకుంటే అవి ఏవిధంగా పనిచేస్తాయి? అనే కోణం కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు కథ రాసేశాడు.
 
మహిళా సంఘాలు ఏదైనా భార్యభర్తల మధ్య సమస్య వస్తే ముందుగా ఇద్దరినీ వేర్వేరుగా విచారిస్తారు. ఆ తర్వాత సమస్య సీరియస్‌ అయితే ధర్నా చేస్తారు. మహిళా కోర్టుకు వెళతారు. ఇవేవీ చూపించకుండా తన సభ్యురాలి భర్త శృంగారినికి   రమ్మంటే రాలేదని నెపంతో ఇంటిలోంచి గెంటేశాడనే పాయింట్‌ పరమ చెత్తగా వుంది. ఇది ఈమధ్య తరచుగా పేపర్లలో ప్రియుడు మోజులో పడి భర్తనే చంపేసిన భార్య.. అనేవి వస్తూనే వున్నాయి. దర్శకుడు, నిర్మాత ఈ కోణంలో కథను రాసుకున్నారనిపిస్తుంది.
 
ఏదిఏమైనా ఇల్లీగల్‌ వ్యవహారాలతోనే ఈ హత్యలు జరుగుతాయి. చాలాకాలం క్రితం హైదరాబాద్‌ మెహిదీపట్నం చౌరాస్తాలో ఓ సూట్‌ కేసు దొరకడం, అందులో హత్యచేసిన శరీరావయవాలు ఉండడం తెలిసిందే. ఇలా కొన్ని సంఘటలను బేస్‌ చేసుకుని సినిమా తీశామని, దర్శకుడు, నిర్మాత, హీరో కూడా చెప్పారు.
 
అదేవిధంగా మీడియాపైనే సెటైర్‌ వేశారు. మాకంటే ముందుగా మీకు హత్య స్పాట్‌ ఎలా తెలుసు? కిల్లర్‌తో మీకేమైనా.? అంటూ కె.డి. అనడం, ఇన్‌ఫర్‌ మేషన్‌ అడిగే క్రమంలో అందరూ ఒకేసారి ప్రశ్నలు వేయడంతో కొబ్బరిచిప్పలగురించి కొట్టుకుంటున్నట్లు ఏమిటి? ఇది అని డైలాగ్‌ చెప్పడం యాదృశ్చికం అయితే కాదని తెలుస్తుంది. 
 
ఇక పోలీసు అధికారులు త్వరగా కేసును ఏదోవిధంగా క్లోజ్‌ చేసే క్రమంలో అమాయకుడిపై నేరం మోపి కాల్పులు జరపాలనుకోవడం వంటివివి నిజానికి దగ్గరగా వున్నాయి. ఏది ఏమైనా ఇటువంటి సినిమాను తీసేటప్పుడు చాలా కేర్‌ తీసుకోవాలి. ఏదో పాయింట్‌ నచ్చింది. ఎదుటివారిది కోడిబుర్ర అనే కోణంలో కథను రాసుకోవడం చాలా మైనస్‌.
 
ఇక సంగీతపరంగా కీరవాణి, సురేష్‌ బొబ్బిలి పర్వాలేదు. నేపథ్య సంగీతం ఓకే. ఇలాంటి సినిమాకు సిద్‌ శ్రీరామ్‌ చేత ఓ పాట పాడిరచడం అంత అవసరంలేదనిపిస్తుంది. 
 
ఇక ఇప్పటి యూత్‌ అంతా పెండ్లికి ముందే అన్నీ అయిపోవాలనే సహజీవనం కావాలనుకుంటున్నారనే కోణంలో హీరో పాత్ర వుంటుంది. గర్భం దాల్చాక పెండ్లి చేసుకోవడం ఇందులో చూపించారు. లంకంత ఇల్లు పెద్ద పోలీసు ఆఫీసర్‌ గర్భవతి అయిన భార్యకు తోడుగా అప్పటివరకు వున్న ఆయన అత్తగారు గాయబ్‌ అవుతుంది. ఎంత కేర్‌లెస్‌గా కథను రాసుకున్నాడనేది తెలిసిపోయింది. ఇలా చాలా తప్పిదాలు వున్నా. కోడిబుర్రలాంటి ప్రేక్షకులు అనుకుని సినిమా చేస్తే వారే తగు విధంగా స్పందిస్తారు. 
 
నటీనటుల పరంగా అందరూ బాగానే చేశారు. ముఖ్యంగా నేరపిశోధన విభాగంలో ఎక్కువశాతం మహిళలను ఆయా శాఖలలో చూపించడం ఒక్కటే వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. సో. టోటల్‌గా ఈ సినిమా ఒకరకమైన వారికి నచ్చుతుందేమో చూడాలి.
 
రేటింగ్‌: 5/2 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుండెపోటుతో కోలీవుడ్ బడా నిర్మాత కన్నుమూత