Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమేజాన్ ప్రైమ్‌లో "V"...నాని విలన్‌గా అదుర్స్.. నా పాత్ర సూపర్బ్.. అదితి రావు

Advertiesment
Aditi Rao Hydari
, శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (18:10 IST)
Aditi Rao Hydari
అమేజాన్ ప్రైమ్ వీడియోలో అదితి రావు నటించిన ''వి'' థ్రిల్లర్ విడుదలైంది. నాని, అదితి జంటగా నటించిన ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ సినిమా అదితి రావుకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టిందనే చెప్పాలి. నాని, సుధీర్ బాబు కాంబోలో తెరకెక్కిన తెలుగు సూపర్ హిట్ థ్రిల్లర్ ''వి'' పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
 
మోహనా కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తే థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించారు. అదితి రావు రోల్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రంలోని ఆమె సస్పెన్స్ రోల్ ఆమెను ఆకర్షించింది.
 
ఈ సందర్భంగా అదితి రావు మాట్లాడుతూ.. ముందుగా ఈ సినిమా కోసం పనిచేసిన టీమ్ అద్భుతమని కితాబిచ్చింద. మోహన్ గారు తనను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. విలో తనది పూర్తి ఆటో ప్యాక్ పాత్ర. సాహిబా పాత్రకి నో చెబుతానని మోహన్ సార్ అనుకున్నారు. ఈ పాత్ర గురించి మోహన్ గారు వివరించి చెప్పడంతో ఓకే చెప్పేశాను. సాహిబా ప్రేమ తనకెంతో నచ్చిందని.. సాహిబాను సినిమాకు హీరోలా చేసిందని చెప్పుకొచ్చింది. ఇక నాని యాక్టింగ్ అదిరిందని.. ఆయన రోల్ ఇందులో తనకెంతో ఆకట్టుకుందని వెల్లడించింది. అతని చుట్టూ కథ నడుస్తుందని తెలిపింది. కథ అద్భుతం. తన పాత్ర ఇంకా బాగుంటుంది. 
 
''నేను సినిమా చేస్తున్నప్పుడు, నేను అస్సలు ప్రశ్నించలేదు. నాకు అభద్రత లేదు.. నేను పద్మావత్ ఎలా చేశానో దానికి చాలా పోలి ఉంటుంది'' అంటూ అదితి వెల్లడించింది. అదితి రూపం, పాటలు, నాని నటన నిజంగా ప్రేక్షకులను ఉత్సాహపరిచింది.
webdunia
Aditi Rao Hydari
 
''V'' ఒక క్రైమ్ రచయితతో ప్రేమలో పడే కథ. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘నేచురల్ స్టార్’ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించారు, నివేదా థామస్, అదితి రావు హైదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సూపర్ స్టార్ నాని కెరీర్‌లో 25వ చిత్రం. అంతేగాకుండా నాని విలన్‌గా నటించిన మొదటి సినిమా. ఈ సినిమా ప్రస్తుతం అమేజాన్ స్ట్రీమింగ్‌లో లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిరోజూ ఆవు మూత్రం తాగే బాలీవుడ్ స్టార్ హీరో ఎవరు?