Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌కు అద్దంప‌ట్టే డియ‌ర్‌మేఘ‌

స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌కు అద్దంప‌ట్టే డియ‌ర్‌మేఘ‌
, శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (13:15 IST)
Arun- megha
ప్రేమ‌క‌థ‌లతో చాలా చిత్రాలు వ‌చ్చాయి. మ‌హిళ ప్రేమ కోణంలో వ‌చ్చే క‌థలు చాలా అరుదు. డియ‌ర్ మేఘ టైటిల్ పెట్టిన‌ప్పుడే లేడీ ఓరియెంటెడ్ అని అర్థ‌మ‌యింది. ఇందులో న‌టించిన మేఘా ఆకాశ్ `రాజ రాజ చోర’లో మెప్పించింది. ఇప్పుడు డియేర్‌మేఘ‌తో ముందుకు వ‌చ్చింది. ఇందులో న‌టించిన అరుణ్ అదిత్ ఇంతకు ముందు సినిమాలు చేసినా తాజాగా ‘లెవన్త్ అవర్’ వెబ్ సిరీస్‌లో న‌టించాడు. ఈయ‌తోపాటు అర్జున్ సోమయాజులు కూడా న‌టించారు. ప‌రిమిత‌మైన న‌టీనటీన‌టుల‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకు సుశాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే థియేటర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
క‌థః
మేఘ (మేఘా ఆకాశ్) జీవితంపై విర‌క్తిచెంది చావ‌డానికి సిద్ద‌మ‌తుంది. ఆ త‌ర్వాత ఒక్క‌సారిగా అందుకు కార‌ణ‌మైన సంఘ‌ట‌నల‌ను గుర్తుచేసుకుంటుంది. త‌ను కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్. తన‌కంటే పెద్ద‌వాడైన ఎంటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అర్జున్ (అర్జున్ సోమయాజుల)ను మొద‌టిచూపులోనే ప్రేమించేస్తుంది. స‌రిగ్గా ప్రేమ‌ను వ్య‌క్తం చేసే స‌మ‌యానికి అర్జున్ సింగ‌పూర్ వెళ్ళిపోయాడ‌ని తెలుసుకుని నిరాశ‌కు గుర‌వుతుంది. మూడేళ్ళ త‌ర్వాత మేఘ కుటుంబం ముంబైకు ఫిస్ట్ అవుతుంది. అక్క‌డ ష‌డెన్‌గా అర్జున్ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. ఇద్ద‌రూ ప్రేమ‌ను వ్య‌క్తం చేసుకుంటారు. హాయిగా వున్న వారి జీవితం విధి జీవితంలో పావులా మారిపోతారు. మ‌న‌శ్శాంతి కోసం మేఘ మ‌రో ఊరు వ‌స్తుంది. అక్క‌డ ఆమెకు ఆది (అరుణ్ అదిత్) ప‌రిచ‌యం జీవితంలో కొత్త ఆశ క‌లుగ‌జేస్తుంది. ఆ త‌ర్వాత ఆమె ఆశ నెర‌వేరిందా?  లేదా? ముగింపు ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేష‌ణః
 
మేఘా ఆకాశ్ నిరాశ‌, నిరుత్సాహం, సంతోషం క‌ల‌గ‌లిపిన పాత్ర‌లో ఒదిగిపోయింద‌నే చెప్పాలి. ఇంత‌కుముందు `లై` సినిమా నుంచి `రాజ రాజ చోర` వ‌ర‌కు ఇంచుమించు భావోద్వేగాలు పండించే పాత్ర‌లు ఆమెను వ‌రించాయి. కాక‌పోతే డియ‌ర్ మేఘ‌లో ఇంకాస్త ఎక్కువ‌గా వున్నాయి. అది ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించిన విధానం, కెమెరామెన్ నైపుణ్యం తోడ‌య్యాయి. ఇక అరుణ్ ఆదిత్  న‌టుడిగా చ‌లాకీగా న‌టించం తెలిసిందే. అయితే కాస్త మైన‌స్ ఏమిటంటే రామ్‌ను గుర్తు చేయ‌డ‌మే. దాన్నుంచి బ‌య‌ట‌ప‌డేలా అత‌ను త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే కొత్త అదిత్‌ను చూసిన‌ట్ల‌వుతుంది. అతని తల్లిగా పవిత్రాలోకేశ్ కీలక పాత్ర పోషించింది. సమాజ సేవకురాలైన డాక్టర్ గా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య చిత్రీకరించిన స‌న్నివేశాలు ర‌క్తిక‌ట్టిస్తాయి. మరో ప్రధాన పాత్రను అర్జున్ సోమయాజుల పోషించాడు.
 
సహజంగా ఇలాంటి ముక్కోణ ప్రేమకథా చిత్రాలు హీరో కోణంలోనే సాగుతుంటాయి. కానీ భిన్నంగా హీరోయిన్ కోణంలో దర్శకుడు చెప్ప‌డం కొత్త‌గా అనిపించింది. అయితే ప్రేమికులు క‌ల‌వ‌డం, విడిపోవ‌డం అనేది ఇంత‌కుముందు కొన్ని వ‌చ్చినా విధి ఏవిధంగా వీరి జీవితాల్లో ఆడుకున్న‌ద‌నే పాయింట్ బాగుంది. దానికితోడు మదర్ సెంటిమెంట్ కు మంచి ప్రాధాన్యం ఇచ్చాడు. అది కాస్తంత హృదయానికి హత్తుకుంటుంది. మొద‌టిభాగం స‌ర‌దాగా, బ‌రువెక్కిన‌ట్లుగా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో ఇంకాస్త బ‌రువైన హృద‌యంతో చూసేలా క‌థ‌ను త‌యారుచేశారు. ప్రేక్ష‌కుడు భారమైన హృదయంతో  బయటకు వస్తారు.
 
అయితే ఇలాంటి సినిమా ప‌ర‌బాష‌లో వ‌చ్చినా ఇందులో పాత్ర‌లు, న‌ట‌న అనేవి కొత్త‌గా అనిపిస్తాయి. గతంలో ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ అనే మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సుశాంత్ రెడ్డి అందులోని లోపాల‌ను స‌రిద్దిద్దుకుని మంచి ప్ర‌య‌త్నం చేశాడు. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌గా చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి ప్రేమ‌క‌థ‌లో ఎక్క‌డా శృతిమించే స‌న్నివేశాలు లేకుండా తీయ‌డం విశేషం. ప్ర‌ధాన బ‌లం హరి గౌర నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ ఐ అండ్రూ మనకున్న బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరు. క్లోజప్ సన్నివేశాలను సైతం చాలా అందంగా చూపించే ప్రయత్నం చేశారు. ఆయన కారణంగా మూవీకి విజువల్ రిచ్ రెస్ వచ్చింది. నిర్మాత అర్జున్ దాస్యన్ చిత్ర నిర్మాణం రాజీలేకుండా తీశారు. కొన్ని లోపాలున్నా ఇలాంటి ఫీల్‌గుడ్ ప్రేమ‌క‌థ‌ను స్లో నెరేష‌న్‌లా  అనిపిస్తుంది. అయినా వ‌ల్గారిటీ లేకుండా తీసిన ఈ సినిమా ముగింపు ఫీల్‌గుడ్‌గా వుంటే బాగుండేది. ప్రేమికులు త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిన సినిమా.
రేటింగ్ : 3/ 5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదంలో ‘భీమ్లా నాయక్’ పాట.. వేరే పదాలు దొరకలేదా?