హర్షివ్ కార్తీక్ ప్రవాసాంధ్రుడు యు.ఎస్.లో అక్కడ తన టీమ్ తో కలిసి నిర్మించి డైరెక్షన్ చేశాడు. తొలిసారిగా లవ్ స్టోరీని ఎంచుకోకుండా మనిషిలో వుండే బహుముఖాలను ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నమిది. కథాపరంగా శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా ఫణి కళ్యాణ్ సంగీతం ఇచ్చాడు. అమెరికాలోనే షూట్ చేయడంతో అక్కడి నటీనటులతో పాటు కెమెరామెన్ ల్యూక్ ఫ్లెచర్ గా వర్క్ చేశారు. ఏప్రిల్ 5న రిలీజయిన ఈ సినిమా థియేటర్స్ లో ప్రదర్శితమబుతోంది. అసలు బహుముఖం ఏమిటి? అనేది తెలుసుకుందాం.
కథ :
తన్వీర్ (హర్షివ్ కార్తీక్) అమెరికాలో జీవించే కుటుంబం. అతని తల్లికి నటన అంటే ప్రీతి. కానీ పరిస్థితుల వల్ల కాలేకపోయింది. తల్లి గురించి తెలిసిన తన్వీర్ తల్లి కన్న కలను తాను సాకారం చేయాలని ధ్రుడనిశ్చయంతో వుంటాడు. అందుకు ప్రయత్నాలు చేస్తాడు. కానీవిధి మరోలా చేస్తుంది. అనుకోకుండా తన్వీర్ ఓ కేసులో జైలుకు వెళతాడు. అలా కొన్నేళ్ళకు బయటకు వస్తాడు.
అయితే చిన్నతనంలో నటుడు కావాలనే కలను ఇప్పుడు సార్థకం చేయాలని చేసిన ప్రయత్నాలు రివర్స్ అవుతాయి. ఓ సందర్భంలో ఆడిషన్ కు వెళితే సైకో పాత్ర ఇస్తారు. దాన్ని సరిగ్గా చేయలేకపోవడంతోఅందరూ ఎద్దేవా చేస్తారు. ఆ తర్వాత ఛాలెంజ్ గా తీసుకుని నటనలో జీవించాలని ప్రయత్నాలు చేస్తూ నిజమైన సైకోలా అనుకోకుండా మారిపోతాడు. ఆ తర్వాత ఏమయంది? తన్వీర్ కల నెరుతుందా? లేదా? అసలుతనెందుకు జైలుకు వెళ్ళాడు. అతనిలోని బహుముఖాలను ఎందుకు బయట పెట్టాడు? అన్నది మిగిలిన కథ.
ఈమధ్య చాలామంది అమెరికాలో వుంటున్న సాఫ్ట్ వేరు ఉద్యోగులు సినిమాపై వున్న తపనతో ఏదో ఒక రంగంలో రావడానికి ముందుకు వస్తున్నారు. అలా కొందరు నటులైతే మరికొందరు నిర్మాతలుగా మారినవారు వున్నారు. కానీ హర్షివ్ కార్తీక్ మాత్రం అన్ని రంగాల్లో పట్టు సంపాదించాలని యూట్యూబ్ ద్వారా సినిమా మేకింగ్ గురించి బాగా స్టడీ చేసి చేసిన ప్రయోగమే ఈ సినిమా. తన గురించి తెలియజేయడానికి అన్నీతానై అయి వివిధ శాఖలలలోని పనులను పూర్తి చేశాడు.
ముఖ్యంగా.. మొత్తంగా ఓ కొకడుకు తన తల్లి కలని నిజం చేయడానికి నటుడిగా మారాలనుకునే క్రమంలో సైకోలా మారితే ఎలా ఉంటుంది అనే థ్రిల్లింగ్ అంశం తో తెరకెక్కించారు.
అందుకే ఈ బహుముఖం సినిమా మొత్తం అమెరికాలోనే షూటింగ్ చేశారు. దీంతో అక్కడ ఉన్న ఇండియన్స్, అమెరికా నటీనటులతో తీశారు. కథ రీత్యా కొత్తగా చూపించాలనే ప్రయత్నం బాగున్నా కథనంలో కథ కొంచెం సాగుతున్నట్టు అనిపిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ కథకు సరియైన మలుపులు కథలో వుండడం విశేషం .కాస్త బెటర్ గా వుంటే మరింత బాగుండేది. తొలిసినిమా కనుక బాగా తీశాడనే చెప్పాలి.
అందరూ కొత్తవారు కావడంతో నటనాపరంగా పర్వాలేదు అనిపిస్తారు. కానీ హర్షివ్ కార్తీక్ మాత్రం తనెందుకు సినిమా తీశాడనే ఇందులో కనిపిస్తుంది. నిజంగా అతనిలో బహుముఖాలు కనిపిస్తాయి. సైకో పాత్రలో జీవించాడనే చెప్పాలి. కథ బేస్ కాబట్టి స్వర్ణిమ సింగ్ హీరోయిన్ గా చేసిన కొంతవరకే పరిమితం చేశారు. అదేవిదంగా మరో అమెరికన్ నటి మరియా మార్టినోవా మెప్పిస్తుంది.
టెక్సికల్ గా కీలకమైంది సినిమాటోగ్రఫీ. కథ ప్రకారం, లొకేషన్ పరంగా ల్యూక్ ఫ్లెచర్ విజువల్స్ చాలా బాగున్నాయి. దానికి అనుగుణంగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఇక శ్రీ చరణ్ పాకాల ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలకి మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో పేమస్. అందకే బాగా చేయగలిగాడు. తల్లి కలని తీర్చడానికి కొడుకు ఏం చేశాడు అనే సింపుల్ కథ అయినా కొత్తగా చూపించడానికి హర్షివ్ కార్తీక్ ప్రయత్నించాడు. మొదటిసారి అని బాధ్యతలు తీసుకొని దర్శకుడిగా, నిర్మాణ విలువల పరంగా నిర్మాతగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ సినిమా అతనికి తెలుగులో ఎంట్రీ కార్డ్ లా ఉపయోగపడుతుంది. ముందు ముందు మరిన్ని సినిమాలు చేయడానికి అనుభవాన్ని సంపాదించాడు. వైవిధ్యమైన సినిమాలను ఆదరిస్తున్న నేటి తరం ఈసినిమా బాగా నచ్చుతుంది.