Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగులో అలరించేనా.. మంజుమ్మల్ బాయ్స్ రివ్యూ రిపోర్ట్

Manjummal Boys

డీవీ

, శనివారం, 6 ఏప్రియల్ 2024 (11:18 IST)
Manjummal Boys
నటీనటులు: సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అర్జున్ కురియన్ తదితరులు
 
దర్శకుడు: సినిమాటోగ్రాఫర్‌: షైజు ఖలీద్, చిదంబరం, నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని, సంగీత దర్శకులు: సుశీన్ శ్యామ్, విడుదల తేదీ : ఏప్రిల్ 06, 202
 
మలయాళంలో 2008 లో కోడైకెనాల్ సమీపంలోని గుణ గుహలో జరిగిన యదార్థ సంఘటన ఆదారంగా మంజుమ్మల్ బాయ్స్ రూపొందించారు. అది తమిళంలోనూ విడుదలై విజయవంతం అయిందని అందుకే తెలుగులో విడుదల చేస్తున్నామని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలిపింది. 
 
క‌థ‌ :
కేరళలోని కొచ్చికి చెందిన మంజుమ్మల్ బాయ్స్.  అంతా పెల్లీడుకు వచ్చిన వాళ్లే. అందులో ఒకరు కాస్త ఏజ్ ఎక్కువే. మొత్తం పదకొండు మంది వుంటారు. కొందరు ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూంటారు. ఆ ఊరిలో జరిగే ఉత్సవాల్లో తాడు లాగే అలవాటుంది. మరో గ్రూప్ తో కలిసి తాడులాగే పోటీలో ఓడిపోతారు. ఓ పెల్లి వేడుకలో మాటామాటా పెరిగి తాగిన మైకంలో కొట్టుకుంటారు. ఆ తర్వాత మంజుమ్మల్ బాయ్స్ సరదాగా టూర్ వెళ్ళాలని కొడైకెనాల్ కారులో బయలుదేరతారు. 
 
అలా వెళుతూ మార్గమధ్యలో గుణ గుహ బ్రహ్మాండంగా వుంటుందని ఒకరు చెప్పడంతో అంతా అక్కడికి వెళతారు. కమల్ హాసన్ సినిమా గుణ అక్కడే షూట్ చేశారు. దాంతో అంతా కలిసి నిషిద్ధ బోర్డు వున్నా తెగించి గుహ లోపలికి దిగుతారు. అనుకోని ఘటనతో ఈ గ్రూప్ లోని ఒకరు జారిపడి గుహలో పడిపోతాడు. అది దాదాపు వందలమీటర్ల లోతుంటుందని ప్రచారం. అక్కడ సైతం బలితీసుకుంటుందని నానుడి. అలాంటి చోట నుంచి జారిపడిన తమ ఫ్రెండ్ ను వారు ఏవిధంగా బటయకు తీసుకువచ్చారనేది కథ.
 
సమీక్ష:
చిన్నతనం నుంచి స్నేహితులుగా వుండే పదకొండు మంది మిత్రులు పెద్దయ్యాక కూడా అలాగే వుంటూ సరదాగా టూర్ చేస్తే జరిగిన ఘటనే సినిమాగా ఎంచుకున్నాడు. ప్రతీదీ ఆసక్తికరంగా దర్శకుడు చూపాడు. అయితే వారంతా అల్లరి చిల్లరిగా తాగుతూ డాన్స్ లు వేస్తూ కాలాన్ని ఎంజాయ్ చేస్తారు. అంతా కేరళలోని మిషనరీ కుటుంబాలకు సంబంధీకులే.  
 
ఓ లోతైన లోయ‌ చుట్టూ అల్లుకున్న ఇన్సిడెంట్స్, అలాగే స్నేహితుల మధ్య ఎమోషన్స్, టూరిస్ట్ గా వెళ్ళి రియ‌లిస్టిక్‌ గా అనుకోని ప్రమాదంలో పడే సీన్స్ అండ్ ఆ లోయలో నుండి బయట పడే సీన్స్ మరియు చివరిగా సినిమాలో ఉన్న మంచి మెసేజ్ ఈ సినిమాకే హైలెట్స్ గా నిలిచాయి. వందలాది అడుగుల లోతైన లోయ‌లో ప‌డిన ఓ యువ‌కుడిని అత‌డి స్నేహితులు ప్రాణాల‌కు తెగించి ఎలా కాపాడారు అన్న‌దే మెయిన్ పాయింట్.
 
కాగా, గతంలో నయనతార నటించిన సినిమా తెలుగులో కర్తవ్యం పేరుతో వచ్చింది. తను ప్రభుత్వ అధికారి. ఊరి పొలాల్లో మూతలేని బోర్ బావిలో ఒకరు పడిపోతే అతన్ని రక్షించేందుకు ఎటువంటి ప్రయత్నం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం ఏవిధంగా సహకరించింది. చివరికి బాలుడి కుటుంబానికి చెందిన వాడే బోరు బావిలో దిగి రక్షించడం అనేది ప్రధాన అంశం. ఈమధ్యలో ఊరి రాజకీయనాయకులఇగోలు, పోలీసు యంత్రాంగం స్వరూపం చక్కగా చూపించాడు.
 
ఇక మంజుమ్మల్ బాయ్స్ లోనూ డిటో. లోతైన గుహలోకి తాళ్ళతో దిగిన స్నేహితుడు ఏవిధంగా రక్షించాడు అన్నదే సెకండాఫ్ కథ. దీని ద్వారా స్నేహానికి విలువ ఎలా వుంటుందో చూపించాడు. ఇది వయస్సులో వున్న వారి నేపథ్యం గనుక అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాలోకూడా పోలీసులు ప్రవర్తన ఎలా వుంటుంది? స్నేహితులు ఓ చోటకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం జాగ్రత్తలు పాటించకుండా గుడ్డిగా ముందుకు వెళితే ఏమవుతుంది? అనేది ముఖ్యం.
 
ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. లోతైన గుహలో గతంలో చాలామంది పడిపోయి మరణించారు. పడినవాడు బతికినట్లు లేదని దర్శకుడు చెబుతారు. కానీ అందులో కేంద్ర మంత్రి మేనల్లుడు కూడా వున్నాడు. ఆయనే ఏమీ చేయలేకపోయాడు అని వివరిస్తాడు. అయితే.. మంజుమ్మల్ బాయ్స్ ఇష్యూ అయ్యాక అక్కడ లోతైన రంధ్రంలో ఐరన్ తో పూడ్చేస్తారు. మరి అంతకుముందు ఎంతో మంది చనిపోయినా పోలీసులు, అటవీ శాఖ ఎందుకు ఆ పనిచేయలేదు అనేదానికి ఆన్సర్ లేని ప్రశ్న
 
ఈ మంజుమ్మల్ బాయ్స్ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చినా, డైరెక్టర్ కొన్నిటిని మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా సింపుల్ గా చూపించి వదిలేశాడు. ఫ్రెండ్ ను కాపాడింది మరో ఫ్రెండ్ అనేది ఆమె తల్లికి మిగిలిన వారు చెప్పకపోవడం మరీ విడ్డూరంగా అనిపిస్తుంది. ఆ విషయం ఎవరో టూర్ వెళుతూ ఓ చిన్న హోటల్ లో చేయి తుడుచుకుంటుండా చిన్న పేపర్ కటింగ్ చూసి దాన్ని లోయలో పడిపోయిన ఆ ఊరి తల్లికి తెలియజేసేలా చేయడం ఎందుకో. అర్థంకాలేదు. ఇలా మొత్తంగా ఓ డాక్యమెంటరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మరి తెలుగులో ఏవిధంగా ఆదరణ అనేది ప్రేక్షకులే చెప్పాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ ఎక్కడ ? ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ అంతా దిల్రాజు భుజాలపై మోస్తున్నాడు