Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిడ్‌నైట్‌.. త్రిష ఏం చేసింది?

'మిడ్‌ నైట్‌ సడన్‌గా ఎక్కడో దూరంగా..' అంటూ విరహంగా పాటపాడుకుంటూ వుంటున్న త్రిష ఏం చేసింది? అనేది సస్పెన్స్‌ అంటూ... దర్శకుడు గోవి అంటున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరెక్కిన ఈ చిత్రంలో నాయకిగా త్రిష నటించింది. రాజ్‌కందుకూరి సమర్పణలో గిరిధర్‌ ప్రొడక్షన

మిడ్‌నైట్‌.. త్రిష ఏం చేసింది?
, గురువారం, 12 మే 2016 (21:29 IST)
'మిడ్‌ నైట్‌ సడన్‌గా ఎక్కడో దూరంగా..' అంటూ విరహంగా పాటపాడుకుంటూ వుంటున్న త్రిష ఏం చేసింది? అనేది సస్పెన్స్‌ అంటూ... దర్శకుడు గోవి అంటున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరెక్కిన ఈ చిత్రంలో నాయకిగా త్రిష నటించింది. రాజ్‌కందుకూరి సమర్పణలో గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై గిరిధర్‌ మామిడిపల్లి, పద్మజ నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తయి నిర్మాణానంతర పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన ఆడియోకు విశేషమైన స్పందన లభించింది. 
 
ముఖ్యంగా త్రిష పాడిన 'మిడ్‌నైట్‌ సడన్‌గా ఎక్కడో దూరంగా..' అనే పాటకు ఆడియో విడుదలైన గంటల్లోనే లక్షకు పైగా హిట్స్‌ వచ్చాయి. సోషల్‌ మీడియాలో ఈ పాట హల్‌చల్‌ చేస్తోంది. 'రాజుగారి గది' తర్వాత సాయికార్తీక్‌ చాలా గొప్పగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను అందించారు. మరోపక్క ప్యాన్‌డాల్‌ సంస్థ ఈ చిత్ర తమిళహక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. 40 నిముషాల గ్రాఫిక్స్‌ చిత్రానికి మరింత ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలోనే సెన్సార్‌ పూర్తిగావించి రెండు భాషల్లో ఒకేరోజున విడుదల చేస్తామని' తెలిపారు. 
 
దర్శకుడు మాట్లాడుతూ.. హారర్‌ తరహా చిత్రాల్లో కొత్తరకమైన చిత్రమిది. కెరీర్‌లోనే అత్యున్నత నటనను త్రిష ప్రదర్శించింది. ఆమె పాత్రకు విభిన్న కోణాలుంటాయి. త్రిషతో పాటు మా అందరికీ ఇది మంచి చిత్రమవుతుంది' అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జగదీష్‌ చీకటి, సంగీతం: రఘు కుంచె, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రాంబాబు కుంపట్ల, కళ: కె.వి. రమణ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30 ఏళ్ళు కుర్చీని వదల్లేకపోయారు.. నల్లోడు అని మాత్ర అనలేదు... విశాల్‌ ఇంటర్వ్యూ