Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ నెల 19న వస్తున్న 'శీనుగాడి లవ్‌స్టోరి'

Advertiesment
seenugadu lovestory movie release confirmed
, మంగళవారం, 9 జూన్ 2015 (18:50 IST)
ఉదయనిధి స్టాలిన్‌-నయనతార జంటగా నటించిన 'శీనుగాడి లవ్‌స్టోరి' అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 19న విడుదలవుతోంది. ఉదయనిధి స్టాలిన్‌ సమర్పణలో.. భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతానం, శరణ్య, ఛాయాసింగ్‌, డా. భరత్‌ రెడ్డి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి హేరిస్‌ జైరాజ్‌ సంగీతం సమకూర్చారు. యస్‌.ఆర్‌.ప్రభాకరన్‌ దర్శకుడు. 
 
రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'సంతానంతో కలిసి ఉదయనిధి స్టాలిన్‌ చేసే కామెడి, నయనతార గ్లామర్‌, హేరిస్‌ జైరాజ్‌ సంగీతం, వనమాలి సాహిత్యం 'శీనుగాడి లవ్‌స్టోరి' చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకొన్న ఈ చిత్రాన్ని ఈ నెల 19న సుమారు 200 కేంద్రాల్లో విడుదల చేస్తున్నాం. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో మరింత పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం' అన్నారు

Share this Story:

Follow Webdunia telugu