Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గమ్మత్తయిన రాముని లీలలు... విడుదల ఫిబ్రవరి 27

Advertiesment
ramleela movie
అతని పేరు రామ్‌. తను చేసే లీలలన్నీ చాలా గమ్మత్తుగా వుంటాయి. అవి అతని జీవితంలో ఎటువంటి మార్పులకు గురిచేశాయనే పాయింట్‌తో 'రామ్‌లీల' చిత్రం రూపొందుతోంది. హవీష్‌, అభిజిత్‌, నందిత కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. శ్రీపురం కిరణ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సెన్సార్‌ పూర్తయిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలియజేస్తున్నారు. ఇందులోని కథ, కథనం, మాటలు, సంగీతం, కెమెరా పనితనం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. 
 
దర్శకుడు తెలుపుతూ.. అమెరికాలో ఓ తెలుగు కుర్రాడి జీవితంలో జరిగిన సంఘటనలతో కథ రూపొందింది. యువత ట్రెండీగా వున్నా, మూలాల్ని మర్చిపోకూడదని చెప్పే సినిమా ఇది. రోడ్‌ జర్నీ నేపథ్యంలో సాగుతుంది. ఐదు పాటలకు మంచి స్పందన వచ్చింది. మలేసియాలోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రించామని' తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.గోపాలరెడ్డి, సంగీతం: చిన్నా, మాటలు: విస్సు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ముత్యాల రమేష్‌.

Share this Story:

Follow Webdunia telugu