Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెప్టెంబర్ 1న జనతా గ్యారేజ్ గ్రాండ్ రిలీజ్

ఎన్టీఆర్ హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం 'జనతా గ్యారేజ్'. ఎన్టీఆర్ సరసన సమాంత, నిత్యా మీనన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రను

Advertiesment
ntr janatha garrage
, మంగళవారం, 23 ఆగస్టు 2016 (21:05 IST)
ఎన్టీఆర్ హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం 'జనతా గ్యారేజ్'. ఎన్టీఆర్ సరసన సమాంత, నిత్యా మీనన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సోమవారంతో షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేసుకున్న జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1న భారీ స్థాయిలో విడుదలవుతుంది అని చిత్ర బృందం తెలిపింది.
 
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో‌నే అత్యధిక థియేటర్‌లలో విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ..."చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ యూనిట్‌తో పని చేయటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. జనతా గ్యారేజ్ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది అన్న నమ్మకం ఉంది.
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లో ఉన్న నటుడికి, ఆయన మాస్ ఇమేజ్‌కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మా నిర్మాతలు సిద్ధపడుతున్నారు", అని తెలిపారు. సాయికుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్ ,సితార, దేవయాని వంటి ప్రఖ్యాత నటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారెజ్‌' ఫ్యాన్స్‌తో ప్రమోషన్‌