Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెప్టెంబర్ 26న 'ముంబై 125 కి.మీ'

Advertiesment
Mumbai 125 km movie
వీణా మాలిక్, కరణ్ వీర్ బోరా ముఖ్యతారలుగా 'వస్తాడు నా రాజు' ఫేం హేమంత్ మధుకర్  స్వీయదర్శకత్వంలో రూపొందుతోన్న భారీ 3 డి హారర్ చిత్రం 'ముంబై 125 కి.మీ'. సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి ఓ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్ 26న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ్ బాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా  డైరెక్టర్ హేమంత్ మధుకర్ మాట్లాడుతూ - ''ఆగస్ట్ లో ఈ చిత్రం ఆడియోను విడుదల చేయబోతున్నాం. ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం హైలైట్  అవుతుంది'' అని చెప్పారు. 
 
నిర్మాత మణిశర్మ మాట్లాడుతూ - ''భారతదేశంలో మొట్టమొదటిసారిగా రియల్ 3డీ మరియు డాల్బీ అత్మొస్ సౌండ్ సంయుక్త టెక్నాలజీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది'' అని తెలిపారు.
 
వీణా మాలిక్, కరణ్ వీర్ బోరా, వెడిత ప్రతాప్ సింగ్, అపర్ణ బాజ్ సాయ్ తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత - మణిశర్మ , హేమంత్ మధుకర్, స్టోరీ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - హేమంత్  మధుకర్

Share this Story:

Follow Webdunia telugu