Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలయ్య అంత సిన్సియరా.. మరి రాధిక అంతమాటనేసిందే..

బాలకృష్ణ షూటింగ్‌కి సకాలంలో రాకపోవడంతో తనకు ఎదురైన ఇబ్బంది గురించి బాలీవుడ్ నటి రాధికా ఆప్టే కొంత కాలం కిందట నర్మగర్భంగా సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం బాలయ్యతో రోగ్ సినిమా షూటింగులో పాల్గొంటున్న చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆయన్ని ఆక

Advertiesment
balayya
హైదరాబాద్ , మంగళవారం, 28 మార్చి 2017 (02:23 IST)
బాలకృష్ణ షూటింగ్‌కి సకాలంలో రాకపోవడంతో తనకు ఎదురైన ఇబ్బంది గురించి బాలీవుడ్ నటి రాధికా ఆప్టే కొంత కాలం కిందట నర్మగర్భంగా సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం బాలయ్యతో రోగ్ సినిమా షూటింగులో పాల్గొంటున్న చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. అలా ఇలా కాదు ఆయన పంక్చువాలిటీ చూస్తుంటే తనకు మతిపోతోంది అన్నంత రేంజిలో పొగిడేశాడు.
 
అయిదేళ్ల క్రితమే బాలయ్యతో సినిమా చేయాలనుకున్నా  కానీ ఇప్పటికి కుదరిందటున్న పూరి ఉదయం ఆరున్నరకు బాలయ్య సెట్‌కి వస్తున్నారని ఆయన క్రమశిక్షణ చూస్తే దిగ్భ్రాంతి కలుకుతోందని అన్నాడు. హీరో అంత త్వరగా షూటింగుకు రావడంతో ఏడు గంటలకే తొలి షాట్ తీయగలుగుతున్నామన్నారు. 
 
తమ యూనిట్‌లో ఉన్న సభ్యులెవరూ ఇంతకు ముందు బాలయ్యతో సినిమా చేయలేదని ఒప్పుకున్న పూరి ఏడు రోజులు వరుసగా షూటింగ్ చేశామన్నారు. బాలయ్య మాత్రం రెండు రోజులే షూటింగ్ చేసినట్లుంది. అంతా పిక్నిక్‌లా, సరదాగా ఉందని అన్నారని పూరి తెలిపారు. దర్శకత్వానికి సంబంధించి తన పనితీరును ఆయన ఎంతగానో ఆస్వాదిస్తున్నారన్నారు. రోగ్ సినిమాలో బాలయ్య లుక్, సంభాషణలు అన్నీ కొత్తగా ఉంటాయని చెప్పారు.
 
ఇందంతా బాగుంది కానీ ఉదయం ఆరుగంటలకే బాలయ్య షూటింగుకు వస్తోంటే అప్పట్లో లెజెండ్ సినిమాలో బాలయ్యతో పనిచేసి బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఆయన షూటింగుకు ఉదయం 9 గంటలకు గానీ రారని ఇన్‌డైరెక్టుగా ఎందుకు వ్యాఖ్యానించినట్లు? ఆమె నర్మగర్భంగా అన్న మాటలను శోధించిన సినీ పండితులు కచ్చితంగా అది బాలయ్యేపైనే అని అప్పట్లోనే తెల్చేశారు. కానీ ఇప్పుడు పూరీ వ్యాఖ్య చేస్తుంటే రాధిక వ్యాఖ్య తప్పా లేక పూరీ అతిశయించి చెబుతున్నారా అని సందేహం కలుగుతోంది.
 
ఏదేమైనా క్రమశిక్షణకు ప్రాణం పోసిన నందమూరి తారక రామారావు కుమారుడుగా బాలకృష్ణ అదే క్రమశిక్షణను షూటింగులో పాటిస్తే అందరికీ సంతోషమే కదా.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీ బర్త్ డే... సెలబ్రిటీల విషెస్ వరద...