Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వచ్చే నెల మొదటి వారంలో 'డా. సలీమ్'

Advertiesment
Dr saleem movie preview
విజయ్ ఆంటోని, అక్ష జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'డా. సలీమ్'. నాగప్రసాద్ సన్నితి సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్ మరియు ఓబులేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంసెన్సార్ కార్యక్రమాలు ఈ వారంలో పూర్తికానున్నాయి. మార్చి మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
 
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సురేష్ కొండేటి మాట్లాడుతూ - "వైద్యం పేరుతో జనాలను దోచుకోవడం నేడు కొన్ని ఆస్పత్రులకు ఆనవాయితీ అయ్యింది. ప్రాణం పోసే డాక్టర్లు ఎక్కువ..ప్రాణం తీసే డాక్టర్లే ఎక్కువ అయిన ఈ రోజుల్లో డా. సలీమ్ మొదటి రకానికి చెందిన వ్యక్తి. ఓ అనాథ పిల్లను కాపాడి, వైద్యం చేసే సలీమ్ ఆ అమ్మాయి అసలు కథ తెలుసుకుంటాడు. అనాథ అమ్మాయికి అన్యాయం చేసిన బడా బాబుల అంతు చూడాలనుకుంటాడు సలీమ్. 

 
తను అనుకున్నది నెరవేర్చుకోవడానికి ఆ డాక్టర్ ఏం చేశాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రంసాగుతుంది. సంగీతదర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని ఈ చిత్రంలో హీరోగా నటించారు. సలీమ్ పాత్రను అద్భుతంగా చేశారాయన. మా ఎస్.కె. పిక్చర్స్ నుంచిఇప్పటివరకు ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలే వచ్చాయి. ఈ చిత్రం కూడా ఆ కోవలో చేరే విధంగా ఉంటుంది. కమర్షియల్ అంశాలు మెండుగా ఉన్న మంచి కథతో దర్శకుడు నిర్మల్ కుమార్అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీయే పాటలు స్వరపరిచారు. మ్యూజికల్ గా కూడా సినిమా హిట్ అవుతుంది'' అని చెప్పారు.
 
మరో నిర్మాత తమటం కుమార్ రెడ్డి మాట్లాడుతూ - ''ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు. అన్ని వర్గాలవారు చూడదగ్గ విధంగా చిత్రం ఉంటుంది. ఈ వేసవికి మంచి ఎంటర్ టైనర్అవుతుంది'' అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎం. అర్జున్ గౌడ్. దర్శకత్వం: ఎన్.వి. నిర్మల్ కుమార్. సంగీతం: విజయ్ ఆంటోని.

Share this Story:

Follow Webdunia telugu