Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండు పాట‌ల మిన‌హా షూటింగ్‌ పూర్త‌యిన 'భ‌లే భ‌లే మగాడివోయ్'

రెండు పాట‌ల మిన‌హా షూటింగ్‌ పూర్త‌యిన 'భ‌లే భ‌లే మగాడివోయ్'
, శనివారం, 4 జులై 2015 (15:19 IST)
ప్రముఖ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్‌పై , మిర్చి, ర‌న్‌ రాజా ర‌న్, జిల్ లాంటి హ్య‌ట్రిక్ సూప‌ర్‌డూప‌ర్ హిట్స్‌ని సొంతం చేసుకున్న‌ క్రేజి ప్రొడ‌క్ష‌న్ హౌస్ UV Creations సంయుక్తంగా ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లేభ‌లే మ‌గాడివోయ్". నాని, లావ‌ణ్య త్రిపాఠీలు జంట‌గా న‌టిస్తున్నారు. వ‌రుస విజ‌యాల‌తో యూత్‌లో ఐకాన్ డైర‌క్ట‌ర్‌గా బ్రాండ్ వేసుకున్న మోస్ట్ క్రేజియ‌స్ట్ డైర‌క్ట‌ర్ మారుతి ద‌ర్శ‌కుడు. హ్య‌ట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న యంగ్ టాలెంటెడ్ నిర్మాత బ‌న్నివాసు నిర్మాత‌. రెండు పాట‌ల షూటింగ్ మిన‌హా చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మ‌ాలు పూర్త‌య్యాయి. ఈ రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ జులై రెండ‌వ వారంలో చేస్తారు. ఆగ‌ష్టు రెండ‌వ వారంలో చిత్రాన్ని విడుదల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
 
హీరో నాని ఈచిత్రం గురించి మాట్లాడుతూ, " నా కెరీర్ స్టార్టింగ్ నుండి చాలా వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించాను. కాని ద‌ర్శ‌కుడు మారుతి తీర్చిదిద్దిన నా పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుంది. నా చిత్రాలంటే ఫ్యామిలి అంతా క‌ల‌సి వ‌చ్చి చూసేలా వుంటాయి, ఈ చిత్రం ఫ్యామిలితో పాటు యూత్ అంతా వ‌చ్చి ఎంట‌ర్‌టైన్ అయ్యేలా వుంటుంది. నాకు  ద‌ర్శ‌కుడు మారుతి చెప్పిన క‌థ న‌చ్చ‌టంతో వెంట‌నే అంగీక‌రించ‌డమే కాకుండా ఏక‌ధాటిగా చిత్రాన్ని కంప్లీట్ చేశాను. ఈ చిత్రంలో నేను ఎప్పుడు చెయ్య‌ని వైవిధ్య‌మైన పాత్ర‌లో క‌నిపిస్తాను. నా పాత్ర‌లోనే కామెడి వుండ‌టంతో నా కేర‌క్ట‌రే ప్ర‌తి ప్రేక్ష‌కుడిని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది.
 
అలాగే హీరోయిన్ లావ‌ణ్య త‌న పాత్ర‌లో చాలా ఒదిగి న‌టించింది. ముర‌ళి శ‌ర్మ గారు స‌ర్‌ప్రైజింగ్ పాత్ర‌లో అందిరిని ఆక‌ట్టుకుంటారు. అలాగే న‌టించిన ఆల్ క‌మెడియ‌న్స్ న‌వ్వంచ‌డ‌మే ప‌నిగా పెట్టుకుని న‌వ్విస్తారు. అంద‌రూ చాలా బాగా న‌టించారు. ముఖ్యంగా నిర్మాత బ‌న్ని వాసు త‌న‌కి ఏమాత్రం ఇబ్బంది క‌ల‌గ‌కుండా హ్యాపీగా ఎంజాయ్‌బుల్‌గా షూటింగ్‌ని చేసే అవ‌కాశాన్ని క‌ల్పించారు. అంద‌రూ సేమ్ ఏజ్ గ్రూప్ వ‌ల‌న షూటింగ్ ఫీలింగ్ లేదు. థ్యాంక్స్ టు ఆల్ మై మూవీ టీం" అని అన్నారు.
 
లావ‌ణ్య త్రిపాఠి త‌న పాత్ర గురించి చెబుతూ, " అందాల‌ రాక్ష‌సి చిత్రంతో ప‌రిచ‌యమైన నేను మొదటి చిత్రంతోనే అంద‌రి అభిమానాన్ని సంపాదించుకున్నాను. త‌రువాత చాలా క‌థ‌లు విన్నాను. విన్న ప్ర‌తి చిత్రం చేయ‌టం లేదు. ఎన్ని చిత్రాలు చేశామ‌నేది కాదు ఎన్ని చిత్రాలు ప్రేక్ష‌కుల‌కి గుర్తున్నాయి అనేది మెయిన్ పాయింట్. అందుకే ఆచితూచి చేస్తున్నాను. దాదాపు నేను చేసిన ప్ర‌తి చిత్రం కూడా నాకు పేరు తీసుకొచ్చిన చిత్రమే. ఇప్పుడు ఈ భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంలో చ‌క్క‌టి తెలిగింటి అమ్మాయిగా క‌నిపిస్తా.
 
మ‌న ప‌క్కింటి అంద‌మైన అమ్మాయిలా అంద‌రి మ‌న‌సులు దోచుకునేలా ద‌ర్శ‌కుడు మారుతి పాత్ర‌ని క్రియేట్ చేశారు. ముఖ్యంగా నాని, నాకు మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ అండ్ రొమాంటిక్ సీన్స్ మ‌న‌సుని గిలిగింత‌లు పెట్టేలా వుంటాయి. మారుతి గారు చెప్పిన కేర‌క్ట‌ర్ చాలా బాగా న‌చ్చి చేస్తున్నాను. ఆయ‌న డైర‌క్ష‌న్‌లో చిత్రం చేస్తున్న ఫీలింగే లేదు నాకు. ఫ్రెండ్స్‌తో వున్న ఫీలింగ్‌నే వుంది. నిర్మాత బ‌న్ని వాసు గారు చాలా కో-ఆప‌రేటివ్ ప‌ర్స‌న్, ఆర్టిస్ట్‌కి ఎప్పుడూ చిన్న ఇబ్బంది కూడా పెట్ట‌కూడ‌దు అనుకునే అతి తక్కువమంది నిర్మ‌ాత‌ల్లో ఆయ‌న ఒక‌రు" అని అన్నారు.
 
హ్య‌ట్రిక్ స‌క్స‌స్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ, " ప్రేమ‌క‌థా చిత్రంతో స‌రికొత్త జోన‌ర్‌తో సినిమా చేశాను. అలాగే కొత్త‌జంటలో ఇద్ద‌రు సెల్ఫిష్‌లు ల‌వ్ చేసుకుంటే ఆ జంట ఎలా వుంటుందో చెప్పాను. ఇప్ప‌డు నాని, లావ‌ణ్యలు జంటగా భ‌లే భ‌లే మగాడువోయ్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాను. ఈ చిత్రం టోట‌ల్‌గా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిస్తున్నాము. ఇది కూడా కొత్త‌రకం జోన‌ర్‌లో తెర‌కెక్కిస్తున్నాము. హీరో నాని , హీరోయిన్ లావ‌ణ్యల పాత్ర‌ల‌తో పాటు చిత్రంలో న‌టించే ప్ర‌తి ఒక్కరి పాత్ర కూడా అందంగా,  వైవిధ్యంగా చేశాము. చిత్రం చూసినంత‌సేపు న‌వ్వించే ప్ర‌య‌త్నంగానే ఈ చిత్రం చేశాము. 
 
క్లైమాక్స్ షూటింగ్‌లో హీరో నాని గారు కొంచెం ప్ర‌మాదానికి గురయ్యారు. అయినా కూడా ఎక్కువ టైం తీసుకోకుండా మ‌ళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు. నానిగారి డెడికేష‌న్‌కి హ్య‌ట్సాఫ్. లావ‌ణ్య కూడా చాలా బాగా న‌టించింది. రెండు పాట‌లు మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. ఈ నెల రెండ‌వ వారంలో ఈ సాంగ్స్ చిత్రీక‌ర‌ణ చేసి ఆగ‌ష్టు రెండ‌వ వారంలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము." అని అన్నారు
 
న‌టీన‌టులు.. నాని, లావ‌ణ్య త్రిపాఠి, ముర‌ళి శ‌ర్మ‌,  న‌రేష్‌, సితార‌, స్వ‌ప్న మాధురి, శ్రీనివాస రెడ్డి,  వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్‌, బ‌ద్ర‌మ్ త‌దిత‌రులు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఎస్‌.కె.ఎన్‌, పి.ఆర్‌.ఓ: ఏలూరు శ్రీను, ఎడిట‌ర్:ఉద్ద‌వ్‌,ఆర్ట్:ర‌మణ వంక‌, ఫొటొగ్రఫి:నిజార్ ష‌ఫి, సంగీతం: గోపి సుంద‌ర్, నిర్మాత:బ‌న్నివాసు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:మారుతి.

Share this Story:

Follow Webdunia telugu