బాటసారి: ఇలా రోడ్డు మీద కూర్చుని అడుక్కోవడానికి సిగ్గూ లేదూ.
బిచ్చగాడు: మీరు ఇచ్చే రుపాయి కోసం ఆఫీసు తెరవాలంటే కష్టం కదండీ.
2.
శంకరయ్య: అదేంటి ఫ్యానుకుండాల్సిన మూడు రెక్కల్లో ఒక్కటే మిగిలింది.
సాంబయ్య: ఆస్తి పంపకాల్లో నా కొడుకులు ఇద్దరూ ఫ్యానుకున్న చెరో రెక్క పట్టుకుని పోయారురా.
3.
భార్య: ఏవండి.... ఏం చేస్తున్నారక్కడ...
వెంగళప్ప: మొక్కలకి నీళ్లు పోస్తున్నాను...
భార్య: వర్షం పడుతోందిగా...
వెంగళప్ప: ఫర్వాలేదు, గొడుగు వేసుకునే పోస్తున్నా........