కరోనా కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన సెలెబ్రిటీలు ఇప్పుడిప్పుడే షూటింగ్‌లకు వెళ్తున్నారు. ఫంక్షన్లకు హాజరవుతున్నారు. తాజాగా లెక్కల మాస్టారు సుకుమార్ తన కూతురు వేడుకను ప్రైవేట్ పార్టీగా జరిపించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత, అక్కినైని నాగ చైతన్య, సమంత, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి దంపతులు హాజరయ్యారు.
అయితే మహేష్, బన్నీలు ఫ్యామిలీలతో కనిపించడం కామన్. కాని ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత తన సతీమణితో ఇలా ప్రత్యక్షం అయ్యే సరికి ఆ ఫొటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. వారి హంగామా చూస్తుంటే ఆ పిక్ ట్రెండిండ్‌లో రావడం ఖాయంగా కనిపిస్తుంది.
కాగా, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత జూనియర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమంతో బుల్లితెరపై కూడా సందడి చేయనున్నట్టు సమాచారం.