Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''నూర్'' ఫస్ట్ లుక్ రిలీజ్.. జర్నలిస్టుగా సోనాక్షి సిన్హా..!

Advertiesment
Sonakshi Sinha'
, గురువారం, 2 జూన్ 2016 (18:59 IST)
దబాంగ్ హీరోయిన్, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటిస్తున్న ''నూర్'' సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. సునీల్‌ సిప్పీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాక్షి జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించబోతోంది. బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఈ ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్‌ ఖాతా ద్వారా బుధవారం విడుదల చేశారు. 
 
పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌, రచయిత సబా ఇంతియాజ్‌ రాసిన 'కరాచీ యు ఆర్‌ కిల్లింగ్‌ మీ' పుస్తకం ఆధారంగా దర్శకుడు సిప్పీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టీ సిరీస్‌, అబండాండియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో నటిస్తున్న సోనాక్షి సిన్హా.. ప్రస్తుతం జాన్‌ అబ్రహం సరసన 'ఫోర్స్‌ 2', ఏ.ఆర్‌.మురగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'అకీరా' చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌క్కా ప్లాన్ టీజ‌ర్ లాంచ్.. హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా..!