Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప‌క్కా ప్లాన్ టీజ‌ర్ లాంచ్.. హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా..!

Advertiesment
pakka plan teaser launch
, గురువారం, 2 జూన్ 2016 (18:13 IST)
శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ పిక్చ‌ర్స్ ప‌తాకంపై నాగేష్ సి.హెచ్ నిర్మాత‌గా బేబీ దివ్య ప్రియ స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.వి.ఫ‌ణీశ్వ‌ర్ (తుఫాన్) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ''ప‌క్కాప్లాన్''. సుభాష్, నాగేష్, భ‌వానీ, యువ‌రాణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్ లాంచ్ ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌స‌న్న కుమార్, తుమ్మ‌లప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ చేతుల మీదుల‌గా టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. అనంత‌రం ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ...`హ‌ర్ర‌ర్ చిత్రాలు ప్ర‌స్తుతం బాగా ఆడుతున్నాయి.

ఈ త‌రుణంలో `ప‌క్కాప్లాన్` లాంటి మంచి టైటిల్‌తో హ‌ర్రర్ చిత్రాన్ని నిర్మించ‌డం మంచి ప్లాన్. టైటిల్ లాగే, టీజ‌ర్ కూడా చాలా డిఫ‌రెంట్ గా ఉంది. కొత్త‌వారైనా కంటెంట్ ఉంటే చాలు సినిమా హిట్ చేయ‌వ‌చ్చ‌ని ఇటీవ‌ల చాలా చిత్రాలు నిరూపించాయి. అలాగే ఓ కొత్త టీమ్ చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం ఫ‌లించాల‌ని` కోర‌కుంటున్నా`అన్నారు. 
 
తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ...`టైటిల్, టీజ‌ర్ రెండూ కూడా చాలా క్యూరియాసిటీ క‌లిగిస్తున్నాయి. ప్రేమ్ స‌మ‌కూర్చిన నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకునే విధంగా ఉంది. టీజ‌ర్ లోనే ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఏంటో తెలిసిపోతుంది. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్` అని చెప్పారు. 
 
సంగీత ద‌ర్శ‌కుడు ప్రేమ్ ఎల్.ఎమ్ మాట్లాడుతూ...`నేను గ‌తంలో రాంగోపాల్ వ‌ర్మ‌గారి చిత్రాల‌కు ప‌నిచేశా. ఓ రోజు ఈ చిత్ర‌ ద‌ర్శ‌కుడు క‌లిసి సినిమా స్టోరీ నేరేట్ చేశారు. చాలా రోజుల త‌ర్వాత ఏకంగా సినిమా తీసుకొని వ‌చ్చి, ఈ సినిమాకు మీ నేప‌థ్య సంగీతంతో ప్రాణం పోయాల‌న్నారు. నేప‌థ్య సంగీతానికి స్కోపున్న సినిమా కావ‌డంతో ఎంతో ఇష్ట‌ప‌డి ఆర్. ఆర్ చేశాన‌న్నారు. 
 
ద‌ర్శ‌కుడు ఎ.వి.ఫ‌ణీశ్వ‌ర్ (తుఫాన్)...`ఓ కొత్త పాయింట్ తో హ‌ర్ర‌ర్, స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ సినిమాగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాము. మా నిర్మాత ప‌క్కాప్లాన్, మా టీమ్ అంద‌రి హార్డ్ వ‌ర్క్ తో ఈ సినిమా అనుకున్న స‌మ‌యానికి, అనుకున్న విధంగా చేయ‌గలిగాము. ఇందులో న‌టించిన వారంద‌రూ కొత్త వారైన‌ప్ప‌టికీ ఎంతో అనుభవం ఉన్న న‌టీన‌టుల్లా న‌టించారు. ప్రేమ్ సంగీతం సినిమాకు ఆయువు ప‌ట్టు` అని తెలిపారు. 
 
నిర్మాత, హీరో నాగేష్ సి.హెచ్ మాట్లాడుతూ...`మా ద‌ర్శ‌కుడు తుఫాన్ గారు అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా తీసారు. ఇలాంటి టీమ్‌తో వ‌ర్క్ చేయడం చాలా సౌక‌ర్యంగా ఉంది. త్వ‌ర‌లో సెన్సార్ పూర్తి చేసి సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప‌క్కా ప్లాన్ జ‌రుగుతోందని` చెప్పారు. 
 
న‌టుడు, కో-డైర‌క్ట‌ర్ ఏ. య‌స్. రావు మాట్లాడుతూ...`ప‌క్కా ప్లానింగ్‌తో సినిమా చేసాం. ప్రేమ్ గారి మ్యూజిక్ హైలెట్. మా ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఏంటో ఇప్ప‌టికే టీజ‌ర్ చూసిన మీకు అర్థ‌మ‌య్యే ఉంటుంది. కాబ‌ట్టి మా టీమ్ అంద‌రినీ ఆశీర్వ‌దిస్తార‌ని ఆశిస్తున్నా` అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెజాన్ యోధులు... మాహిష్మతి రాజ్యం... టీజ‌ర్ విడుద‌ల‌