ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్-2 అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ తదితరులు కర్ణాటకలోని కొల్లూర్ శ్రీ మూకాంబికా టెంపుల్.. అలాగే, అనెగుడ్డే వినాయక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు
కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన కేజీఎఫ్ అఖండ విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.