బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ చిత్రంలో అక్కినేని హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కరీనా కపూర్ హీరోయిన్. అద్వైత్ చందన్ ఈ చిత్రాన్ని గత రెండేళ్లుగా తెరకెక్కిస్తున్నాడు.
దేశంలోని పలు ప్రాంతాలలో మూవీ చిత్రీకరణ జరుపుకుంది. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్‌కు హిందీ రీమేక్‌గా రూపొందిన 'లాల్‌సింగ్ చద్దా' చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అలాగే ఇదే తేదీన మరో పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్2 విడుదల కానుంది. ఇలా విడుదల తేదీలు క్లాష్ కావడంపై అమీర్ ఖాన్ స్పందించారు.
రెండు భారీ సినిమాలు ఒకే తేదీన విడుదల కావడం వల్ల చిత్ర నిర్మాతలకు నష్టం కలుగుతుందని భావిస్తున్నాంటూ కేజీఎఫ్-2 దర్శక నిర్మాతలకు క్షమాపణలు చెప్పారు. వేరే నిర్మాత ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్‌లో ఎప్పుడూ తన సినిమాను విడుదల చేయాలనుకోలేదు. కానీ ఈసారి మాత్రం తప్పడం లేదంటూ చెప్పుకొచ్చారు.