Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేకే మీనన్ నటించిన “లవ్ ఆల్” చిత్రం మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను గెలుచుకున్న వింక్ స్టూడియో

image
, గురువారం, 7 సెప్టెంబరు 2023 (22:24 IST)
డౌన్‌లోడ్స్, రోజువారీ క్రియాశీల యూజర్స్ ద్వారా భారతదేశం యొక్క నం.1 మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ అయిన వింక్ మ్యూజిక్, ఈరోజు భారతదేశం యొక్క అతిపెద్ద మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ ఎకోసిస్టమ్ అయిన వింక్ స్టూడియో పి.గోపీచంద్ అనే బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ యొక్క జీవితం ఆధారంగా తెరకెక్కిన కే కే మీనన్ నటించిన “లవ్ ఆల్” అనే చిత్రం యొక్క డిస్ట్రిబ్యూషన్ హక్కులను గెలుచుకున్నట్లు ప్రకటించినది.  
 
“లవ్ ఆల్” చిత్రాన్ని మహేశ్ భట్ మరియు పి గోపీచంద్‌లు ఆనంద్ పండిట్‌తో కలిసి నిర్మించారు. ఇది ఎమ్. రమేశ్ యొక్క లక్ష్మీ గణపతి ఫిల్మ్ స్టూడియోస్ ద్వారా సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయబడుతుంది. ఈ చిత్రానికి సుధాంశు శర్మ దర్శకత్వం వహించగా, స్వస్తిక ముఖర్జీ, రాబిన్ దాస్, శ్రీశ్వర, అతుల్ శ్రీవాస్తవ మరియు రాజా బుందెల నటించారు. ఈ సినిమాలో ఇప్పటికే వింక్ పై అందుబాటులో ఉన్న ఐదు చిరకాలం గుర్తుండిపోయే పాటలు ఉన్నాయి. 
 
1. బాతోన్ బాతోన్ మే, గాయకులు- జుబిన్ నౌతియాల్
2. గిల్లి సీ సుబాహ్, గాయకులు - పాపన్
3. ఛల్ ఉఠ్ ఝట్ పఠ్, గాయకులు- సోనూ నిగమ్
4. లవ్ ఆల్ బోల్ దే, గాయకులు- కే కే మీనన్
5. సహాస్ దో సహాస్, గాయకులు- అంజలి గైక్వాడ్
 
డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం గురించి మాట్లాడుతూ, ఆదర్శ్ నాయర్, సిఇవో – ఏర్‌టెల్ డిజిటల్ అండ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ – ఏర్‌టెల్, గారు, “వింక్ స్టూడియో స్వతంత్ర కళాకారుల కోసం ఒక సృజనాత్మక వేదికను అందించే లక్ష్యంతో స్థాపించబడింది, అలాగే ఇది వారు ఎదుర్కొనే మోనిటైజేషన్ మరియు ఆవిష్కరణల పరమైన సమస్యల విషయంలో కూడా వారికి సహాయపడుతుంది. మేము స్వతంత్ర కళాకారులతో గొప్ప విజయాలను పొందాము మరియు ప్రస్తుతం వేయిమందికి పైగా కళాకారులు మాతో ఉన్నారు. ఈ డిస్ట్రిబ్యూషన్ భాగస్వామ్యం అనేది డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ కోసం అన్వేషిస్తున్న మరియు ఏర్‌టెల్ యొక్క స్వాభావికమైన రీచ్ మరియు కనెక్టివిటీని ఉపయోగించాలనుకుంటున్న నిర్మాతల కోసం కొత్త ద్వైపాక్షిక మార్గాలను తెరుస్తుంది.” అన్నారు.
 
వింక్ స్టూడియో స్థాపించిన కాలం నుండి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చినది. ఇది ఇటీవల మంజ్ మ్యూజిక్ మరియు అనూష దండేకర్ ద్వారా వచ్చిన “లవ్ టోకెన్”, విశాల్ దద్లానీ యొక్క “బిల్లో” మరియు నిఖిత గాంధీ యొక్క సింగిల్ అయిన ఒక ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన అమ్మాయి యొక్క రొమాంటిక్ మరియు గ్రూవీ నంబర్ “ప్యార్ మేన్ పాగల్” వంటి స్వతంత్ర సింగిల్స్ ను ఏకకాలంలో పంపిణీ చేసింది.
 
వింక్ 15 భారతీయ భాషలలో సంగీతాన్ని అందిస్తుంది మరియు ప్రాంతీయ పాటలు ఇప్పుడు యాప్ పై మొత్తం స్ట్రీమ్ లలో 30% కు పైగా ఉన్నాయి. ఒరియా, గుజరాతీ, అస్సామీస్, మరాఠీ, తెలుగు మరియు భోజ్‌పురి భాషల్లో గల పాటలు 150% కు పైగా వృద్ధిని సాధించాయి మరియు అవి వారి స్వరాష్ట్రం వెలుపల కూడా ప్రసిద్ధి చెందాయి.
 
వింక్ యొక్క సంగీత ప్రయాణం:
సెప్టెంబర్ 2014: భారతదేశంలో ప్రారంభమైంది: 4 రోజుల్లోనే 1 లక్ష డౌన్‌లోడ్ లను మించిపోయినది
ఫిబ్రవరి 2015: 5 మిలియన్ల యాప్ డౌన్‌లోడ్స్ మించిపోయినది
జూన్ 2015: డేటా సేవ్ మోడ్ ప్రారంభించినది
నవంబర్ 2015: 12 మిలియన్ల ఇన్‌స్టాల్స్ మించిపోయినది
జనవరి 2016: ఎంపీ3 ప్లేయర్ ఫంక్షన్ ను పరిచయం చేసినది – లోకల్ ఎంపీ3 ఫైల్ ప్లే చేయునది
మార్చ్ 2017: 50 మిలియన్ల ఇన్‌స్టాల్స్ మించిపోయినది
జనవరి 2018: 75 మిలియన్ల ఇన్‌స్టాల్ (ల) ను మించిపోయినది
డిసెంబర్ 2018: ప్లేస్టోర్ పై భారతదేశం యొక్క అత్యంత వినోదాత్మక యాప్ గా ఎంపికైనది
జనవరి 2019: 100 మిలియన్ ఇన్‌స్టాల్స్ మించిపోయినది
ఆగస్ట్ 2022: వింక్ స్టూడియోను ప్రారంభించినది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రాన్స్‎జెండర్ గా నవాజుద్దీన్ సిద్దికి రివెంజ్ డ్రామా హడ్డి