Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళల కోసం కోటి రూపాయిలు పెడుతున్న రైటర్ పద్మభూషణ్‌

Suma with writer team
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (22:48 IST)
Suma with writer team
 ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్  నిర్మించిన ఈ చిత్రాన్ని  జి. మనోహర్ సమర్పించారు. ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ  చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా చిత్ర యూనిట్ ‘ది స్వీట్ సర్‌ప్రైజ్ రివీల్’ ప్రెస్ మీట్  ని నిర్వహించింది. ప్రముఖ యాంకర్ సుమ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
 
 యాంకర్ సుమ మాట్లాడుతూ.. ఇంత మంచి కథని తీసుకొచ్చిన శరత్, అనురాగ్, చంద్రు గారికి అభినందనలు.  రైటర్ పద్మభూషణ్‌’  ప్రోమోలు ఎంత ఆసక్తిగా ఉన్నాయంటే.. మూడో తేదీనే సినిమా చూసేశాను. చాలా బావుంది. దర్శకుడు ప్రశాంత్ కి అభినందనలు. రేపు బుధవారం ఈ సినిమాని ఆడవాళ్ళ కోసమని ఒక గిఫ్ట్ లా ఉచితంగా చూపించబోతున్నారు. ఎవరి కోసం సినిమాని చేశారో వారికి సినిమా చేరాలనే ఉద్దేశంతో ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న నిర్మాతలకు అభినందనలు. ఆడవాళ్లకు భూదేవి అంత సహనం వుందని అంటారు. కానీ కొంచెం స్వార్ధం కూడా కావాలి (నవ్వుతూ). మీ కోసం కొంత సమయం తీసుకోవాలి. బుధవారం  రైటర్ పద్మభూషణ్‌ సినిమాని చూడండి. మీరు చాలా కనెక్ట్ అవుతారు.  ఇందులో వినోదం వుంది, మనకోసం అందమైన సందేశం వుంది. సుహాస్ చాలా సహజంగా నటించారు. టీనా, గౌరీ, రోహిణీ , ఆశిష్ విద్యార్ధి అందరూ చక్కగా చేశారు. అమ్మలందరూ ఈ సినిమా చూడండి. మగవాళ్ళు కూడా సినిమాకి వెళ్ళొచ్చు. కానీ మీరు డబ్బులు పెట్టుకొని వెళ్ళండి(నవ్వుతూ) ఆడవాళ్లకు మాత్రం ఉచితం’’ అని తెలిపారు.
 
 నిర్మాత శరత్ మాట్లాడుతూ.. ‘రైటర్ పద్మభూషణ్‌’ విడుదలైన తర్వాత ఓ మంచి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఎవరి ద్వారా జనాల్లోకి వెళ్ళాలి అని ఆలోచించినపుడు ..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతో గౌరవించే, ఆదరించే సుమ గారి ద్వారా ఈ ఆలోచన చెప్పడం మంచిది అని భావించాం. రేపు( బుధవారం) రెండు తెలుగు రాష్ట్రాలలో  దాదాపు 39 థియేటర్స్ లో నాలుగు షోలుని మహిళాలకు ఉచితంగా చూపిస్తున్నాం.  చాలా గౌరవంగా ప్రేమతో ఇన్వైట్ చేస్తున్నాం. అందరూ థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాం.  39 థియేటర్స్ లో నాలుగు షోలు కలిపి దాదాపు 70 వేల మంది ప్రేక్షకులు సినిమా చూసే కెపాసిటీ వుంది. 70 వేల ఫ్యామిలీస్ తో రేపు ఒక మీటింగ్ జరగబోతుంది. దిని కోసం కోటి రూపాయిలు పెడుతున్నాం. ఎక్కువ మంది మహిళా ప్రేక్షకులు చూడాలనేది మా ఉద్దేశం.  గీత ఆర్ట్స్ వారికి ఈ ఆలోచన చెప్పగానే ఎంతోగానో సపోర్ట్ చేశారు. పాసులు ప్రింట్ చేసిన ఎంపిక చేసిన థియేటర్స్ పంపించాం. మహిళలకు కౌంటర్ వద్ద ఉచిత పాసులు ఇస్తారు. భార్య భర్తలు ఇద్దరూ కలిసి వస్తే .. భార్య ఉచితంగా సినిమా చూస్తారు, భర్త టికెట్ కొనుక్కుంటారు. ఇదే మా స్వీట్ సర్‌ప్రైజ్ ఫర్ విమన్. దయచేసి రేపు మహిళలు అందరూ వచ్చి సినిమా చూసి ఓ గొప్ప స్ఫూర్తిని పొందుతారని ఆశిస్తున్నాను. మహిళలు తప్పకుండా చూడాల్సిన సినిమా రైటర్ పద్మభూషణ్‌’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయి ధరమ్ తేజ్ ఆవిష్కరించిన వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్